Mohan Babu: జంప్ జిలానీ.. పరారీలో మంచు మోహన్ బాబు.. గాలిస్తున్న పోలీసులు

|

Dec 13, 2024 | 6:38 PM

మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. కాగా బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టులో బెయిల్ కోసం పిటీషన్ వేశారు మోహన్ బాబు. ఆ పిటీషన్ న్యాయస్థానం కొట్టేసింది. దాంతో ఇప్పుడు మోహన్ బాబు పరారీలో ఉన్నారు.

Mohan Babu: జంప్ జిలానీ.. పరారీలో మంచు మోహన్ బాబు.. గాలిస్తున్న పోలీసులు
Mohanbabu
Follow us on

మంచు ఫ్యామిలీ రచ్చ కొనసాగుతుంది. మోహన్ బాబు ఇంటి దగ్గర మంచు మనోజ్ చేసిన హంగామాలో జర్నలిస్ట్ లు గాయపడిన విషయం తెలిసిందే. విచక్షణ కోల్పోయిన మోహన్ బాబు టీవీ 9 రిపోర్టర్ పై దాడి చేశారు. మోహన్ బాబు చేసిన దాడిలో టీవీ 9 రిపోర్టర్ కు తీవ్రంగా గాయం అయ్యింది . మంచు ఫ్యామిలీలో ఆదివారం మొదలైన హైడ్రామా..స్టిల్ కంటిన్యూ అవుతోంది. సోమవారం మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు 40 మంది బౌన్సర్లను పెడితే.. దానికి పోటీగా 30 మంది బౌన్సర్లను దింపాడు మనోజ్‌. ఈ నేపథ్యంలో జల్‌పల్లిలోని మంచుటౌన్‌లో మంగళవారం ఉదయం.. మంచు విష్ణు-మనోజ్‌ బౌన్సర్ల మధ్య తోపులాట జరిగింది. మనోజ్‌ బౌన్సర్లను ఇంటి నుంచి బయటకు పంపేశారు విష్ణు బౌన్సర్లు. ఇక ఇప్పటికీ గొడవలు కొనసాగుతోంది..

అయితే ఈ గొడవల నేపథ్యంలోనే చిన్న బ్రేక్ ఇచ్చి మనోజ్ తన సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయితే టీవీ9 రిపోర్టర్ పై దాడి కేసులో మోహన్ బాబు పై పోలీసు కేసు నమోదు అయ్యింది. మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే మోహన్ బాబు పరారీలో ఉన్నారని తెలుస్తుంది. మోహన్‌బాబు కోసం 5 చోట్ల పోలీసుల గాలింపు చేపట్టారు. కానీ ఎక్కడా మోహన్‌బాబు ఆచూకీ దొరకలేదని తెలుస్తుంది. ఇప్పటికే మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే.

మోహన్‌బాబుకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీవీ9 జర్నలిస్ట్‌ రంజిత్‌పై హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది హైకోర్టు. జర్నలిస్ట్‌ రంజిత్‌పై హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ మోహన్‌బాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు
-మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. జల్‌పల్లిలో విధి నిర్వహణలో ఉన్న టీవీ9 జర్నలిస్ట్‌ రంజిత్‌పై మంచు మోహన్‌బాబు హత్యాయత్నం చేశారు. రంజిత్‌కు దవడ ఎగువ భాగంలో ఫ్రాక్చర్ కావడంతో వైద్యులు సర్జరీ చేశారు. రంజిత్‌పై హత్యాయత్నం చేసిన మోహన్‌బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ‌మోహన్‌బాబును అరెస్ట్‌ చేయాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో మోహన్‌బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా .. అక్కడ షాక్‌ తగిలింది. ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది హైకోర్టు.