Waltair Veerayya: విశాఖకు వాల్తేరు వీరయ్య వచ్చేస్తున్నాడు.. ప్రీరిలీజ్ ఈవెంట్‏కు లైన్ క్లియర్..

|

Jan 07, 2023 | 9:09 AM

సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. పాటలు, ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో వేగం పెంచింది చిత్రయూనిట్.

Waltair Veerayya: విశాఖకు వాల్తేరు వీరయ్య వచ్చేస్తున్నాడు.. ప్రీరిలీజ్ ఈవెంట్‏కు లైన్ క్లియర్..
Megastar Chiranjeevi
Follow us on

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్స్‏తో పాటు .. ఇద్దరూ కలసి అలరించిన పూనకాలు లోడింగ్ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ చిత్రంలో చిరు సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. పాటలు, ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో వేగం పెంచింది చిత్రయూనిట్.

తాజాగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుకకు లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. ముందుగా ఈ వేడుకను విశాఖలోని ఆర్కే బీచ్ లో నిర్వహించాలనుకున్నారు. అయితే ఈ వేడుకకు పోలీసులు అనుమతి నిరాకరించినట్లుగా తెలిసిందే. దీంతో మెగా అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. ముందుగా నిర్ణయించినట్లుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 8న సాయంత్రం 5 గంటలకు విశాఖలోని ఆర్కే బీచ్‏లో నిర్వహించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో చిరు ఫుల్ మాస్ అవతారంలో కనిపించనున్నారు. చాలాకాలం తర్వాత చిరు, రవితేజ కలిసి నటిస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాకు సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.