Bhola Shankar: హిందీలోనూ రిలీజ్ కాబోతున్న భోళా శంకర్.. టీజర్ విడుదల.. రిలీజ్ ఎప్పుడంటే..

ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా కథానాయికగా నటించగా.. చిరు చెల్లిగా కీర్తి సురేష్.. ఆమె ప్రియుడిగా సుశాంత్ నటించారు. ఇందులో యాంకర్ శ్రీముఖి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను కీలకపాత్రలలో నటించారు. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు హిందీలో రిలీజ్ కాబోతుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాను హిందీలో ఆర్కేడీ స్టూడియోస్ రిలీజ్ చేయనుంది.

Bhola Shankar: హిందీలోనూ రిలీజ్ కాబోతున్న భోళా శంకర్.. టీజర్ విడుదల.. రిలీజ్ ఎప్పుడంటే..
Bhola Shankar

Updated on: Aug 15, 2023 | 12:02 AM

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం భోళా శంకర్. డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదలై మిక్డ్స్ టాక్ సొంతం చేసుకుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కించారు. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా కథానాయికగా నటించగా.. చిరు చెల్లిగా కీర్తి సురేష్.. ఆమె ప్రియుడిగా సుశాంత్ నటించారు. ఇందులో యాంకర్ శ్రీముఖి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను కీలకపాత్రలలో నటించారు. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు హిందీలో రిలీజ్ కాబోతుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాను హిందీలో ఆర్కేడీ స్టూడియోస్ రిలీజ్ చేయనుంది.

ఈ సినిమాను ఆగస్ట్ 25న హిందీ వెర్షన్ థియేటర్లలోకి వస్తుందని ఆర్కేడీ స్టూడియోస్ తాజాగా ఓ టీజర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాకు హిందీలో చిరంజీవి బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్ డబ్బింగ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మేకర్స్ రిలీజ్ చేసిన హిందీ వెర్షన్ టీజర్ ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

చిరంజీవి ట్వీట్.. 

చిరంజీవి ట్వీట్.. 

ఈ సినిమా తర్వాత చిరు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో రాబోయే చిత్రం కూడా రీమేక్ అని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. బంగార్రాజు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు కళ్యాణ్ కృష్ణ.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్.. 

భోళా శంకర్ హిందీ టీజర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.