Waltair Veerayya: మెగాస్టార్ వాల్తేరు వీరయ్య హవా.. 4 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..

| Edited By: Ravi Kiran

Jan 19, 2023 | 8:12 AM

అందరూ అనుకున్నట్టే.. వీరయ్య పూనకాలు లోడయ్యాయి. అందరికీ దిమ్మతిరిగేలా చేశాయి. కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. పండగ రోజుల్ని మరింత జోష్ ఫుల్ గా మార్చాయి.

Waltair Veerayya: మెగాస్టార్ వాల్తేరు వీరయ్య హవా.. 4 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘వాల్తేరు వీరయ్య’. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్ సినిమాను నిర్మించారు. సంక్రాంతి సంద‌ర్బంగా జ‌న‌వ‌రి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. మెగాస్టార్ అంటే మాస్ ఇమేజ్‌..ఈయ‌న‌కు తోడుగా ఇప్పుడు మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా ఇందులో యాడ్ అయ్యారు.
Follow us on

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ అయ్యింది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అందరూ అనుకున్నట్టే.. వీరయ్య పూనకాలు లోడయ్యాయి. అందరికీ దిమ్మతిరిగేలా చేశాయి. కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. పండగ రోజుల్ని మరింత జోష్ ఫుల్ గా మార్చాయి. చిరు అవతార్‌కు.. ఆయన మాస్‌ యాక్టింగ్‌కు ఈలలు పడేలా చేస్తున్నాయి. ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా.. రీసెంట్ గా రిలీజైంది. రిలీజ్‌ అవ్వడమే కాదు.. పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. కలెక్షన్లను కుమ్మేస్తోంది.శృతి హాసన్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ కూడా కీలక పాత్రలు పోషించారు.

ఇక ఈ సినిమా విడుదలై నాలుగు రోజులు అవుతున్న కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. నైజాం 20.14 కోట్లు, సీడెడ్ 11.24 కోట్లు,
ఉత్తరాంధ్ర 7.12కోట్లు, ఈస్ట్ 5.56 కోట్లు, వెస్ట్ 3.35కోట్లు, గుంటూరు 4.77 కోట్లు, కృష్ణా 4.08 కోట్లు, నెల్లూరు 2.20 కోట్లు, ఏపీ,తెలంగాణ కలిపి 58.46 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 5.17 కోట్లు, ఓవర్సీస్ 9.50 కోట్లు, వరల్డ్ వైడ్ 73.13 కోట్లు (షేర్).

ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయి. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.73.13 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.13.87 కోట్ల షేర్ ను రాబట్టాలి.

ఇవి కూడా చదవండి