చిత్రపరిశ్రమలో స్టార్స్ మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. దక్షిణాది, ఉత్తరాది అనే తేడా లేకుండా అగ్ర హీరోల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది.. మెగాస్టా్ర్ చిరంజీవి, కమల్ హాసన్, రజినీ కాంత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్.. ఇలా సినీ పరిశ్రమలోని హీరోల మధ్య మంచి అనుబంధం ఉంటుంది.. ఇటీవల విశ్వనటుడు కమల్ హసన్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో నిర్వహించిన విక్రమ్ సక్సెస్ సెలబ్రెషన్స్ లో పాల్గొ్న్న కమల్.. ఆ తర్వాత తన చిరకాల మిత్రుడు చిరును కలిశారు.. మెగాస్టార్ ఏర్పాటు చేసిన ఈ పార్టీలో సల్మాన్ సైతం తళుక్కుమన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), విక్టరీ వెంకటేష్ (Venkatesh), బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ఒకే ఫ్రేమ్ లో కనిపించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు.. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తమ ఫేవరేట్ స్టార్స్ ఇలా చాలా కాలం తర్వాత కలవడంతో అభిమానులు సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు.
ఇంతకీ వీరు ముగ్గురు ఎక్కడ కలిశారు ? అని అనుకుంటున్నారు.. ఇక్కడే భాగ్యనగరంలోనే.. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది.. షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ దొరకడంతో వెంటనే చిరు, వెంకీతో కలిసి ఓ ప్రైవేట్ పార్టీకి హజరయ్యినట్లుగా తెలుస్తోంది.. వీరు ముగ్గురు కలిసి కెమెరాలకు ఫోజులిచ్చారు. వీరితో పాటు.. జేసి పవన్ రెడ్డి సైతం ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇక సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న కభీ ఈడీ కభీ దివాళీ మూవీలో వెంకటేష్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. డైరెక్టర్ ఫర్హాద్ సాంజి దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తానికి చాలా కాలం తర్వాత బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ ఇలా ఒకే ఫ్రేములో కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.