Chiranjeevi : మాఫియా డాన్‌గా మారనున్న మెగాస్టార్.. ఏ సినిమా కోసం అంటే..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేశారు చిరు.

Chiranjeevi : మాఫియా డాన్‌గా మారనున్న మెగాస్టార్.. ఏ సినిమా కోసం అంటే..
Megastar

Updated on: Feb 21, 2022 | 5:16 PM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేశారు చిరు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చిరుతోపాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరు చరణ్ ఇద్దరు నక్సలైట్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదలై ఉండాలి కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఏప్రిల్ 1న ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు చిరు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయినా లూసిఫర్ సినిమాకు రీమేక్ గా రానుంది. గాడ్ ఫాదర్ అనే టైటిల్ తో రానున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీ తర్వాత మెహర్ రమేష్ డైరెక్షన్ లో సినిమాను పట్టాలెక్కించనున్నారు మెగాస్టార్.

ఈ మూవీ తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం మూవీకి రీమేక్ గా రానుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ మెగస్టార్ సిస్టర్ గా కనిపించనుంది. అలాగే తమన్నా చిరుకి జోడీగా నటిస్తుంది. ఇక బాబీ దర్శకత్వంలో ఓ సినిమాను ఓకే చేశారు చిరు. వీటితో పాటు యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములు చెప్పిన కథకు కూడా మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంకీ సినిమాలో మెగాస్టార్ ఎలా ఉండబోతున్నారన్న ఆసక్తి ఇప్పుడు మెగా అభిమానుల్లో మొదలైంది. అయితే ఈ  సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో మెగాస్టార్ మాఫియా డాన్ గా కనిపించనున్నారట. ఆయన పాత్రను చాలా డిఫరెంట్ గా వెంకీ డిజైన్ చేసినట్టుగా చెబుతున్నారు. చిరంజీవి లుక్ చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. ఈమూవీలో యాక్షన్ సీన్స్ తోపాటు కావాల్సినంత కామెడీ కూడా ఉంటుందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas : ‘ప్రభాస్ నువ్ తెచ్చిన క్వాంటిటీతో ఆర్మీకి భోజనం పెట్టవచ్చు’.. డార్లింగ్ ఆతిథ్యం చూసి బిగ్ బి షాక్

గులాబీ పువ్వుల విరబూసిన ఆమ్నా షరీఫ్ అందాలు.. ఫోటోలు చుస్తే మతిపోవాల్సిందే.

తన అందాలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న బిగ్ బాస్ విన్నర్ తేజస్వి ప్రకాష్ లేటెస్ట్ ఫోటోస్.

Mahesh Babu: మరోసారి వెండితెరపై అలనాటి నటి.. మహేష్‏కు పిన్నిగా ఆ హీరోయిన్..