మెగాస్టార్ చిరంజీవి.. తనయుడు రామ్ చరణ్ కు పుట్టిన రోజు కానుకగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. చెర్రీ చిన్నతనం నుంచి తనపట్ల ఎంత కేరింగ్ గా ఉంటాడో గుర్తు చేసుకుంటూ.. చెర్రీకి పుట్టిన రోజు విషెష్ చెప్పారు చిరు. ఓ కుర్చీలో కూర్చుని ఉన్నచిరంజీవికి చరణ్ చిన్నతనంలో ఎలా గొడుగు పట్టాడా .. ఇప్పుడు కూడా అదే తండ్రిపట్ల అదే ప్రేమ అంటూ.. ఆచార్య సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి కి ఎండతగలకుండా గొడుగు పట్టిన ఫోటోలతో ఉన్న వీడియో షేర్ చేశారు చిరంజీవి.. అంతేకాదు అప్పుడు , ఇప్పుడు, ఎల్లప్పుడూ హి ఈజ్ కేరింగ్ సన్ అంటూ ఆ వీడియో కి ఓ క్యాప్షన్ జత చేశారు చిరు.. ఎల్లపుడు మా బంధం ఇలానే ఉంటుందంటూ తనయుడు రామ్ చరణ్ ను సురేఖ చిరంజీవి హత్తుకున్న ఫొటోతో కొడుకుకి స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్పారు.
చిరంజీవి నట వారసుడిగా వెండి తెరపై చిరుత సినిమాతో అడుగు పెట్టిన రామ్ చరణ్.. తర్వాత విభిన్న కథా చిత్రాలతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. రాజమోళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమాతో టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసి.. తనకంటూ ఫ్రటీకేఆ గుర్తింపు తెచ్చ్చుకున్నాడు. హీరోగానే కాదు.. అభిమానుల పట్ల ప్రేమగా.. సమాజ సేవ చేయడంలో .. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అండగా ఉంటూ.. మెగా పవర్ స్టార్ అనిపించుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం హీరోగా నటిస్తూనే.. కొణిదెల బ్యానర్ ను స్థాపించి తల్లి సురేఖ పేరుతో సినిమాలను నిర్మిస్తూ.. సక్సెస్ ఫుల్ నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. ఈరోజు తన 36 వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు.
Happy Birthday My Boy @AlwaysRamCharan pic.twitter.com/iKRZ0G8Ji5
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2021
Also Read: 70 మిలియన్ల ఖాతాదారులకు శుభవార్త.. ప్రైవేటీకరించబడని బ్యాంకులు ఇవే..