Megastar Chiranjeevi : 158వ సినిమా అనౌన్స్ చేసిన చిరు.. అంచనాలు పెంచేసిన జిమ్ వర్కవుట్స్ వీడియో.. డైరెక్టర్ ఎవరంటే..

మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే సంక్రాంతి పండక్కి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే తన కొత్త సినిమా అనౌన్స్ చేశారు చిరు.

Megastar Chiranjeevi : 158వ సినిమా అనౌన్స్ చేసిన చిరు.. అంచనాలు పెంచేసిన జిమ్ వర్కవుట్స్ వీడియో.. డైరెక్టర్ ఎవరంటే..
Megastar Chiranjeevi

Updated on: May 17, 2026 | 7:38 PM

తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల సంక్రాంతి కానుకగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న చిరు.. ఇప్పుడు కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన తన సోషల్ మీడియా వేదికగా ఒక అద్భుతమైన జిమ్ వీడియోను షేర్ చేస్తూ, సినిమా ఓపెనింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం చిరంజీవికి దాదాపు 70 ఏళ్ళ వయసు ఉన్నప్పటికీ, ఆయన జిమ్‌లో పడుతున్న కష్టాన్ని చూసి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎంతో ఎనర్జిటిక్‌గా, డెడికేషన్‌తో ఆయన చేస్తున్న వర్కౌట్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

“పరిమితులను దాటి ముందుకు సాగడానికి ప్రతి రోజు ఒక కొత్త అవకాశం.. నా ప్రియమైన దర్శకుడు బాబీతో మరో చిరస్మరణీయ ప్రయాణం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను” అంటూ చిరంజీవి ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. చిరు కొత్త సినిమాను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో చేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ క్రేజీ కాంబోపై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

ఈ చిత్రాన్ని మే 21వ తేదీన వైభవంగా ముహూర్తపు పూజా కార్యక్రమాలతో (Opening Ceremony) ప్రారంభం కానుంది. ఈ సినిమాను ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ ‘KVN ప్రొడక్షన్స్’ భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. పూజా కార్యక్రమాలు ముగిసిన వెంటనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుందని సమాచారం. చిరు షేర్ చేసిన ఈ సరికొత్త జిమ్ లుక్, ‘మెగా 158’ పై అంచనాలను మరింతగా పెంచేసింది.

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

Follow Us