Ram Charan – Upasana: రామ్ చరణ్, ఉపాసన కూతురి పేరు ఇదే.. ట్వీట్ చేసిన చిరంజీవి..

|

Jun 30, 2023 | 4:49 PM

వివాహం జరిగిన 11 ఏళ్లకు ఉపాసన.. చరణ్ దంపతులకు కూతురు పుట్టడంతో మెగా ఫ్యామిలీతోపాటు మెగా అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. వారసురాలి రాకతో మెగా కుటుంబంలో సంబరాలు నెలకొన్నాయి. అంతేకాకుండా.. చిరు ఫ్యామిలీకి ఇష్టమైన మంగళవారమే పాప జన్మించడంతో చిరంజీవి కుటుంబం సంతోషంలో మునిగిపోతున్నారు.

Ram Charan - Upasana: రామ్ చరణ్, ఉపాసన కూతురి పేరు ఇదే.. ట్వీట్ చేసిన చిరంజీవి..
Ram Charan Upasana Daughter
Follow us on

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. ఈనెల 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వివాహం జరిగిన 11 ఏళ్లకు ఉపాసన.. చరణ్ దంపతులకు కూతురు పుట్టడంతో మెగా ఫ్యామిలీతోపాటు మెగా అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. వారసురాలి రాకతో మెగా కుటుంబంలో సంబరాలు నెలకొన్నాయి. అంతేకాకుండా.. చిరు ఫ్యామిలీకి ఇష్టమైన మంగళవారమే పాప జన్మించడంతో చిరంజీవి కుటుంబం సంతోషంలో మునిగిపోతున్నారు. జూన్ 30న మెగాస్టార్ ఇంట్లో బారసాల కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. తాజాగా తన మనవరాలి పేరు తెలియజేస్తూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. రామ్ చరణ్, ఉపాసన కూతురి పేరు క్లింకారా (Klin Kaara) అనే పెట్టినట్లుగా తెలిపారు.

క్లింకారా అనేది లలితాసహస్రనామాల్లో ఒక బీజాక్షం. ప్రకృతికి శక్తికి ప్రతిరూపం అర్థం అని.. ఆ పేరుతో ఒక శక్త, పాజిటివ్ వైబ్రేషన్ ఉందని.. ఈ లక్షణాలని మా లిటిల్ ప్రిన్సెస్ అందిపుచ్చుకొని తన వ్యక్తిత్వతంలో పెరిగేకొద్దీ ఇమడ్చుకుంటుందని నమ్ముతున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.