Throwback: బాలకృష్ణ సినిమా ప్రారంభానికి అతిథులుగా చిరంజీవి.. రజినీకాంత్.. ఏ మూవీ అంటే..

|

Apr 22, 2023 | 12:42 PM

మీకు తెలుసా.. బాలకృష్ణ సినిమా ప్రారంభానికి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వచ్చారు. చిరు మాత్రమే కాదు.. సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం బాలయ్య మూవీ పూజా కార్యక్రమాలకు విచ్చేశారు. వీరు ముగ్గురు కలిసి ఒకే వేదికపై ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. మరీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా.

Throwback: బాలకృష్ణ సినిమా ప్రారంభానికి అతిథులుగా చిరంజీవి.. రజినీకాంత్.. ఏ మూవీ అంటే..
Chiranjeevi, Balakrishna, R
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రాణాలిచ్చే అభిమానులున్నారు. ఒకప్పుడు ఈ ఇద్దరి హీరోస్ సినిమాలు రిలీజ్ అయ్యాయంటే.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. గతంలో వీరి మధ్య పోటా పోటీగా మూవీస్ వచ్చేవి. ఇక సంక్రాంతి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద చిరు , బాలయ్య సినిమాలకు గట్టి పోటీ ఉండేది. వీరిద్దరు కలిసి ఒకే వేదికపై కనిపించడం చాలా అరుదు. ఇక ఇటీవల వీరు కలిసి కనిపించిన సందర్భాలే లేవు. ప్రస్తుతం ఎవరీ చిత్రాల్లో వారు బిజీగా ఉన్నారు. కానీ మీకు తెలుసా.. బాలకృష్ణ సినిమా ప్రారంభానికి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వచ్చారు. చిరు మాత్రమే కాదు.. సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం బాలయ్య మూవీ పూజా కార్యక్రమాలకు విచ్చేశారు. వీరు ముగ్గురు కలిసి ఒకే వేదికపై ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. మరీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా.

బాలకృష్ణ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ భైరవద్వీపం. సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. విజయా ప్రొడక్షన్స్ అధినేత బి.నాగిరెడ్డి తనయుడు బి. వెంకట్రామిరెడ్డి చందమామ విజయా కంబైన్స్ పతాకం పై ఈ మూవీని నిర్మించారు. 1993 జూన్5న ఈ చిత్రం చెన్నైలోని విజయా, వాహినీ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అప్పట్లో ఈ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. రామానాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతేకాకుండా.. ప్రారంభ సన్నివేశానికి రజినీకాంత్ క్లాప్ కొట్టగా.. చిరంజీవి కెమెరా స్విచ్ ఆన్ చేశారట. ప్రస్తుతం వీరి ముగ్గురికి సంబంధించిన ఫోటో వైరలవుతుంది.

Bairava Dweepam

ఈ సినిమాలో బాలయ్య జోడిగా రోజా నటించగా.. రంభ కీలకపాత్రలో కనిపించింది. వీరి ముగ్గురి కలయికలో వచ్చిన తొలి చిత్రం ఇది. అలాగే తెలుగులో గ్రాఫిక్స్ ఉపయోగించిన తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం. అప్పట్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.