Megastar Chiranjeevi: మిమ్మల్ని చూస్తే రతన్ టాటా గుర్తొస్తారు.. ఆనంద్ మహీంద్రాపై చిరంజీవి ప్రశంసలు..

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో వీరిద్దరు కలుసుకున్నారు. ఆనంద్ మహీంద్రాను చూస్తుంటే ఎన్నో విషయాల్లో రతన్ టాటా గుర్తొస్తారని అన్నారు. మరోవైపు మెగాస్టార్ వినయానికి ముగ్ధుడినయ్యానంటూ మహీంద్రా ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరు ఒకరిపై మరొకరు పొగడ్తలతో ట్వీట్ చేశారు.

Megastar Chiranjeevi: మిమ్మల్ని చూస్తే రతన్ టాటా గుర్తొస్తారు.. ఆనంద్ మహీంద్రాపై చిరంజీవి ప్రశంసలు..
Megastar Chiranjeevi, Anand

Updated on: Dec 11, 2025 | 4:39 PM

భారత వ్యాపారం దిగ్గజం ఆనంద్ మహీంద్రాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఆయనను చూస్తుంటే రతన్ టాటా గుర్తొస్తారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం చిరు చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేడుకలో వీరిద్దరు కలుసుకున్నారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశీయ, అంతర్జాతీయ పలు రంగాల దిగ్గజాలు, సినీప్రముఖులు హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజులకు సైతం ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమంలో ఆనంద్ మహీంద్రాతో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు చిరు.

ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..

ఈ సమ్మిట్ అనంతరం ఆనంద్ మహీంద్రా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చిరంజీవితో దిగిన ఫొటోను షేర్ చేశారు. “సీఎం రేవంత్ రెడ్డితో విజన్ 2047 గురించి చర్చించాక, మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఊహించని సర్‌ప్రైజ్. ఆయన ఒక లెజెండ్. కానీ, ఆయనలోని వినయం, ప్రతీ విషయంపై చూపిన నిజమైన ఆసక్తి నన్ను మరింతగా ఆకట్టుకున్నాయి. నేర్చుకోవాలనే తపన, వినయంతో వినడమే ఏ రంగంలోనైనా శాశ్వత విజయానికి పునాది” అని మహీంద్రా తన పోస్టులో పేర్కొన్నారు.

ఆనంద్ మహీంద్రా ప్రశంసలపై చిరంజీవి కూడా స్పందించారు. “డియర్ ఆనంద్ మహీంద్రా గారూ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ స్వభావం ఎందరికో ఆదర్శనీయం. మీరు చాలాసార్లు నాకు రతన్ టాటాను గుర్తుకు తెస్తారు. ఆయన తన విలువలతో స్ఫూర్తిగా నిలిస్తే, మీరు సేవా కార్యక్రమాలలో చూపుతున్న నిబద్ధత ఎంతో మందికి ఆదర్శం. మీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది” అని చిరంజీవి బదులిచ్చారు.

కాగా, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే, చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

 

ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..

Loading...
Unable to load recommendations.
Follow Us