Megastar Chiranjeevi: పూరీ జగన్నాథ్ చస్తే చేయనన్నాడు.. మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేసిన చిరంజీవి..

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో భాగంగా.. తాజాగా చిరును యాంకర్ శ్రీముఖి ఇంటర్వ్యూ చేసింది. విమానంలో చిరును శ్రీముఖి ఇంటర్వ్యూ చేసిన ప్రోమోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

Megastar Chiranjeevi: పూరీ జగన్నాథ్ చస్తే చేయనన్నాడు.. మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేసిన చిరంజీవి..
Megastar Chiranjeevi

Updated on: Sep 24, 2022 | 2:52 PM

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం తన లేటేస్ట్ చిత్రం గాడ్ ఫాదర్ (God Father) ప్రమోషన్స్ కోసం సిద్ధమవుతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ మూవీ విడుదల కాబోతుండగా.. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. చిరు మాత్రమే కాకుండా.. సల్మాన్ ఖాన్, నయనతార కీలకపాత్రలలో నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ , టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేయగా.. ఇక గత రెండు రోజులు క్రితం చిరు చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. అలాగే చిరు, సల్మాన్ కలిసి వేసిన స్టెప్పులకు అభిమానులు ఫిదా అయ్యారు. మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్‏గా రాబోతున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో భాగంగా.. తాజాగా చిరును యాంకర్ శ్రీముఖి ఇంటర్వ్యూ చేసింది. విమానంలో చిరును శ్రీముఖి ఇంటర్వ్యూ చేసిన ప్రోమోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

” సల్మాన్ ఖాన్ కేవలం ఈ సినిమాను ప్రేమతోనే చేశాడు. హ్యాట్సాఫ్ టూ సల్మాన్ భాయ్. ఇక జర్నలిస్ట్‏గా పూరి జగన్నాథ్ కనిపించనున్నాడు… సార్ నేను చేస్తే చేయను అన్నాడు. ఆయనలో కమాండింగ్ ఉన్న నటుడు ఉన్నాడని చూసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఈ సినిమాకు ఆరో ప్రాణం ఎస్ఎస్ తమన్. ఒక్క మాటలో చెప్పాలంటే గాడ్ ఫాదర్ నిశ్శబ్ధ విస్పోటనం. హీరోయిన్స్, సాంగ్స్ అనే ఆలోచన లేకుండా ఉండే సబ్జెక్ట్ ఇది” అంటూ చెప్పుకొచ్చారు చిరు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

వీడియో..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.