Chiranjeevi: మెగాస్టార్ మాస్ లుక్.. వాల్తేరు వీరయ్య నుంచి ఫోటో లీక్.. సోషల్ మీడియా షేక్

ఈ సినిమా తర్వాత.. సైరా నరసింహారెడ్డి, ఆచార్య సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. ఆచార్య సినిమాతో నిరాశపడిన ఫ్యాన్స్ కు గాడ్ ఫాదర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి బాస్ ఈస్ బ్యాక్ అని రీసౌడ్ వచ్చేలా చేశారు.

Chiranjeevi: మెగాస్టార్ మాస్ లుక్.. వాల్తేరు వీరయ్య నుంచి ఫోటో లీక్.. సోషల్ మీడియా షేక్
Mega 154

Updated on: Oct 11, 2022 | 3:53 PM

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న విషయం తెలిసిందే. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ సినిమా తర్వాత.. సైరా నరసింహారెడ్డి, ఆచార్య సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. ఆచార్య సినిమాతో నిరాశపడిన ఫ్యాన్స్ కు గాడ్ ఫాదర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి బాస్ ఈస్ బ్యాక్ అని రీసౌడ్ వచ్చేలా చేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చింది. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించి అలరించారు. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నయనతార నటించి అలరించారు.

ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి నెక్స్ట్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ అనే సినిమా చేతున్నారు చిరు. ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళమ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా రానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తిసురేష్ నటిస్తోంది. అలాగే ఈ సినిమాతో పాటు వాల్తేరు వీరయ్య అనే సినిమా చేస్తున్నాడు చిరు. ఈ సినిమాలో మాస్ క్యారెక్టర్ లో చిరంజీవి కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన మోషన్ పోస్టర్స్ సినిమా పై అంచనాలను పెంచేశాయి.

అలాగే ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఓ పిక్ బయటకు వచ్చింది. చేతిలో స్మార్ట ఫోన్..చేతికి కాశీ తాడులు..వేలికి ఉంగరాలు..కాస్ట్యూమ్స్ …చిరు సిట్టింగ్ స్టైల్..ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అభిమానులు చిరును చూసుకుని మురిసిపోతున్నారు. త్వరలోనే ఈ సినిమానుంచి క్రేజీ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

Megastar Chiranjeevi

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.