Mana Shankara VaraPrasad Garu : ఒకే స్టేజ్ పై వెంకటేశ్, చిరంజీవి.. మన శంకరవరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..

సంక్రాంతి పండక్కి కలిసి సందడి చేసేందుకు సిద్ధమయ్యారు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్. ఈ క్రమంలోనే సినిమా విడుదలకు ముందే ఒకే స్టేజ్ పై కనిపించనున్నారు చిరు, వెంకీ. దీంతో ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారు సినిమాపై మరింత క్యూరియాసిటి ఏర్పడింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

Mana Shankara VaraPrasad Garu : ఒకే స్టేజ్ పై వెంకటేశ్, చిరంజీవి.. మన శంకరవరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..
Mana Shankavaraprasad Garu

Updated on: Jan 06, 2026 | 7:53 AM

మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ మన శంకరవరప్రసాద్ గారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి సక్సెస్ అయ్యిందుకు రెడీ అయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత చిరు నటిస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా.. అతిథి పాత్రలో కనిపించనున్నారు విక్టరీ వెంకటేశ్. చిరు, వెంకీ ఒకే సినిమాలో కనిపించడడంతో ఈ మూవీ చూసేందుకు అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను సంక్రాంతి పండక్కి జనవరి 12న రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి :  Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‏ను గెలిచి.. ఇప్పుడు ఇలా..

ఇప్పటికే మన శంకరవరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. మరోవైపు విభిన్న కంటెంట్ అంశాలతో.. తనదైన స్టైల్లో వరుసగా ప్రమోషన్ వీడియోస్ షేర్ చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అధికారికంగా ప్రకటించింది మూవీ టీమ్. ఈ వేడుకను జనవరి 7న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు చిరుతోపాటు వెంకీ సైతం రానున్నారట. ఇద్దరు కలిసి ఒకే స్టేజ్ పై ప్రేక్షకులను అలరించనున్నారు.

ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..

వీరితోపాటు లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం రానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్టు అందుకున్న వెంకీ.. ఈసారి చిరుతో కలిసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో 7 సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..