Megastar Chiranjeevi: క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన చిరంజీవి.. మన శంకరవర ప్రసాద్ గారు సినిమా సెట్‏లో సందడి..

ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం సాధించి‏న సంగతి తెలిసిందే. ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన క్రికెటర్ తిలక్ వర్మను అభినందించారు మెగాస్టార్ చిరంజీవి. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడుతూ అద్భుతమైన ఇన్నింగ్స్ తో టీమిండియా విజయంలో భాగస్వామి అయిన తిలక్ వర్మ ప్రతిభను మెచ్చుకున్నారు చిరు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతుంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా ఈ మూవీ సెట్ లో ఆసియా కప్ హీరో తిలక్ వర్మ సందడి చేశారు. ఓవైపు షూటింగ్ తో బిజీగా ఉన్న చిరు, సెట్స్ లో ఇండియన్ క్రికెటర్ తిలక్ వర్మను సన్మానించారు. ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన క్రికెటర్ తిలక్ వర్మను మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ సెట్ లో అభినందించారు చిరు. అద్భుతమైన ఇన్నింగ్స్ తో టీమిండియా విజయంలో భాగస్వామి అయిన తిలక్ వర్మ ప్రతిభను చిరు మెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.