Mega Fans: ఉద్దేశ్యపూర్వకంగా అవమానాలకు గురిచేస్తున్నారు.. మెగా ఫ్యాన్స్ ఆవేదన

|

Mar 24, 2023 | 3:58 PM

సేవ్ రియల్ ఫ్యాన్స్.. రెస్పెక్ట్ సీనియర్ ఫ్యాన్స్ అనే నినాదంతో మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌లను కలిసి తమ బాధలు చెప్పుకునేందుకు సిద్దమవుతున్నారు.

Mega Fans: ఉద్దేశ్యపూర్వకంగా అవమానాలకు గురిచేస్తున్నారు.. మెగా ఫ్యాన్స్ ఆవేదన
Mega Fans
Follow us on

వారంతా మోగాస్టార్‌ చిరంజీవి అభిమానులు.. గత కొంతకాలంగా కొంతమంది చిరంజీవి అభిమానులు తమను ఉద్దేశ్యపూర్వకంగా అవమానాలకు గురిచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేవ్ రియల్ ఫ్యాన్స్.. రెస్పెక్ట్ సీనియర్ ఫ్యాన్స్ అనే నినాదంతో మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌లను కలిసి తమ బాధలు చెప్పుకునేందుకు సిద్దమవుతున్నారు. ఒంగోలులో జరిగిన అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్‌ సభ్యుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొంతమంది చిరంజీవి అబిమానులు 2016లో ప్రారంభించిన అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ సభ్యులకు ఇటీవల అవమానాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

మెగా అభిమానులు అందరూ సిగ్గూ పడేలా అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత ఇటీవల ఒక ప్రకటన చేశారని, అందులో అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్‌కు తమకు ఎలాంటి సంబంధం లేదని లెటర్ ప్యాడ్ లో ప్రకటించడం మెగా సోదరులు అందరూ సిగ్గు పడాల్సిన విషయం అంటున్నారు.. అన్నయ్య చిరంజీవికి ఎదో ఒక రోజు మన అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్‌ ఏసిఎఫ్‌ గురించి తెలుస్తుందని తెలిపారు.

రెండు రోజుల క్రితం జరిగిన రామ్ చరణ్ ఫోటో సెషన్ కి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ‌మళ్ళీ అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను చిరంజీవి, రామ్‌చరణ్‌లను కలవనివ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు.. ఇక తప్పని పరిస్థితుల్లో ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి నాంది పలిమని తెలిపారు.. చిరంజీవి గారి అభిమానానికి తాము నోచుకోకుండా ఎంత మంది అడ్డు పడినా ఏమి చేయలేరని తెలిపారు.. ఏప్రియల్‌ 16వ తేదిన ఛలో హైదరాబాద్‌ పేరుతో చిరంజీవి, రామ్‌చరణ్‌లను కలిసి పరిస్థితిని వివరిస్తామంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం..