Chiranjeevi: దాని ముందు ఆస్కార్ కూడా చిన్నదే.. ఎమోషనల్ అయిన మెగాస్టార్

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాదు. తెలుగు సినిమా స్థాయిని పెంచేసింది.

Chiranjeevi: దాని ముందు ఆస్కార్ కూడా చిన్నదే.. ఎమోషనల్ అయిన మెగాస్టార్
Chiranjeevi

Updated on: Feb 19, 2023 | 7:36 AM

మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. రామ్ చరణ్ ను చూసి గర్వపడుతున్నారు. దానికి కారణం ఏంటంటే.. రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాదు. తెలుగు సినిమా స్థాయిని పెంచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రశంసలు అందుకుంది. ఇక ఈసినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు. తారక్ కొమురం భీమ్ గా.. చరణ్ అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమా పై హాలీవుడ్ దర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రశంసించారు. అలాగే నటీనటులను పొగడ్తలతో ముంచెత్తారు.

ఇటీవల జేమ్స్ కెమరూన్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ నటనను అభినందించారు. చరణ్ అద్భుతంగా నటించాడని.. సినిమాలో అతని పాత్ర ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. అలాగే రాజమౌళి ఆర్ఆర్ఆర్ ను తెరకెక్కించిన విధానం.. విజవల్స్, మ్యూజిక్ అన్ని నచ్చాయని అన్నారు.

అలాగే ఆర్ఆర్ఆర్ చూస్తుంటే..ఆర్ఆర్ఆర్ సినిమాలోని రోల్స్, విజువల్ ఎఫెక్స్ట్ ను చూసిన తర్వాత షేక్ స్పియర్ క్లాసిక్ గుర్తుకొచ్చిందని కేమరూన్  అన్నారు. ఈ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందిస్తూ..రామ్ చరణ్ ఈ స్థాయికి ఎదిగాడా అని తండ్రిగా గర్వపడుతున్నానని.. ఈ ప్రశంస ముందు ఆస్కార్ కూడా చిన్నదే అన్ని అభిప్రాయం వ్యక్తం చేశారు చిరంజీవి.