
టాలీవుడ్ లో సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. అందమైన ప్రేమ కథలను ఆకట్టుకునే కుటుంబకథలను తెరకెక్కించడం లేదు శేఖర్ కమ్ముల దిట్ట. శేఖర్ కమ్ముల సినిమాలే కాదు ఆ సినిమాల కోసం ఆయన ఎంచుకునే హీరోయిన్స్ కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతారు. కుటుంబ కథలను అందంగా తెరకెక్కించి ప్రేక్షకులకు అందిస్తారు శేఖర్ కమ్ముల. ఈ టాలెంటడ్ దర్శకుడు ప్రస్తుతం ధనుష్ తో కలిసి ఓ భారీ ప్రజెక్టు చేస్తున్నారు. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమాకు కుబేర అనే ఇంట్రస్టింట్ గైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా ఇటీవలే శేఖర్ కమ్ముల ఇండస్ట్రీలో 25 ఏళ్ల జర్నీని పూర్తి చేసుకున్నారు. శేఖర్ కమ్ముల 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శేఖర్ కమ్ములను స్పెషల్ గా అభినందించారు. సినిమాల్లో చిరంజీవి తన స్ఫూర్తి చేసి ఆయనతో సినిమా చేయాలనే కల ఉందని. ఇప్పుడు ఆయన తనను అభినందించడం ఎంతో సంతోషంగా ఉంది అని శేఖర్ కమ్ముల తెలిపారు. తాజాగా మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా శేఖర్ కమ్ములకు అభినందనులు తెలిపారు.ఈమేరకు ఆయన తన ఎక్స్ ఇలా రాసుకొచ్చారు..
” మై డియర్ శేఖర్, మీలాంటి ఒక అభిమాని వుండటం నాకూ అంతే ఆనందకరం. మీ ప్రస్థానానికి స్ఫూర్తి నిచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25 years జర్నీలో ఆ విధంగా నేనూ ఒక భాగమైనందుకు గర్వంగా వుంది.సున్నితమైన వినోదంతో పాటు, ఒక సోషల్ కామెంట్ ని జత చేసి ఆలోచనాత్మకంగా తీసే మీ సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం. ఫిలిం మేకింగ్ లో మీ కంటూ ఒక ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకున్న మీరు ఇలాగే మరో 25 ఏళ్ళు మరెన్నో జనరంజకమైన సినిమాలు ‘వ్రాస్తూ’, తీస్తూ, మరెన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తున్నాను” అంటూ మెగాస్టార్ రాసుకొచ్చారు.
మై డియర్ శేఖర్, @sekharkammula మీలాంటి ఒక అభిమాని వుండటం నాకూ అంతే ఆనందకరం. మీ ప్రస్థానానికి స్ఫూర్తి నిచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25 years జర్నీలో ఆ విధంగా నేనూ ఒక భాగమైనందుకు గర్వంగా వుంది.సున్నితమైన వినోదంతో పాటు, ఒక సోషల్ కామెంట్ ని జత చేసి ఆలోచనాత్మకంగా తీసే మీ… pic.twitter.com/8MVKQdiiJ3
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 3, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.