Chiranjeevi: మాతృదినోత్సవం స్పెషల్.. ఆసక్తికర ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు

అంతర్జాతీయ మాతృదినోత్సం (మే08) సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తల్లులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సందర్భంగా తన ఫ్యామిలీకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను కూడా షేర్ చేశారు. ఇప్పుడు ఈ మెగా ఫ్యామిలీ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Chiranjeevi: మాతృదినోత్సవం స్పెషల్.. ఆసక్తికర ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
Chiranjeevi

Updated on: May 10, 2026 | 1:58 PM

ఇవాళ (మే08) అంతర్జాతీయ మాతృదినోత్సవం. దీంతో అందరూ తమ తల్లులకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సందర్భంగా తమ తల్లులతో కలిసి దిగిన కొన్ని అందమైన ఫొటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా గతంలో తమ తల్లులతో కలిసి దిగిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ను నెట్టింట షేర్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా మదర్స్ డే స్పెషల్ విషెస్ తెలిపారు. అమ్మ గొప్పతనం, త్యాగం గురించి ప్రస్తావిస్తూ ప్రపంచంలోని తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘అమ్మ…మన మొదటి గురువు, మన మొదటి ధైర్యం, కనిపించే దైవం కూడా “కని పెంచిన” మాతృమూర్తి తర్వాతే…! మన విజయాల వెనక త్యాగం… మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మది. మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు’ అమ్మ గొప్పతనానికి అక్షర రూపమిచ్చారు చిరంజీవి. ఇదే క్రమంలో తన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని త్రో బ్యాక్ ఫొటోస్ ను షేర్ చేశారు మెగాస్టార్. ఇందులో చిరంజీవితో పాటు ఆయన తల్లి అంజనా దేవి, తండ్రి వెంకట్రావు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నాగబాబు, ఇద్దరు సోదరీమణులను కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా మెగాభిమానులు ఈ ఫొటోలను నెట్టింట తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు చిరంజీవి. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. గతంలో వీరి కాంబోలో వాల్తేరు వీరయ్య అనే బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చింది. ఇప్పుడు రెండో సినిమా కావడంతో ఈ కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి. మెగా 158 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కాకాజీ అనే టైటిల్ పెడతారని ప్రచారం జరుగుతోంది. టాక్సిక్, జన నాయగణ్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ మెగా మూవీని నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

మెగాస్టార్ చిరంజీవి మదర్స్ డే స్పెషల్ పోస్ట్..


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us