మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమాకు ఎంతో గర్వకారణం. సాధారణ కుర్రాడు నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు మెగాస్టార్ అయ్యాడు. ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఎంతో మందికి స్పూర్తిగా మారాడు. అందరిలాగే చిరు కూడా కెరీర్ తొలినాళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అనేక కష్టాలను తట్టుకుని.. ఆత్మ విశ్వాసంతో ప్రయత్నాలు చేసి హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఈరోజు చిరు పుట్టినరోజు. మెగా అభిమానులకే కాకుండా సినీ ప్రియులకు కూడా ఈరోజు పండగే. 1978లో సినీ ప్రయాణం ప్రారంభించిన చిరు.. హీరోగా నటించిన తొలి చిత్రం పునాది రాళ్లు. కానీ ఈ మూవీ కంటే ముందే ప్రాణం ఖరీదు సినిమా విడుదలైంది. ఆ తర్వాత చిరుకు హీరోగా వరుస అవకాశాలు వచ్చాయి. చిరు అసలు పేరు కొణిదెల శివశంకర్ వరప్రసాద్. ఆయన డైలాగ్స్, మేనరిజమ్ ఇప్పటికీ యూత్ లో మంచి క్రేజ్ ఉంది.
దశబ్దాలుగా సినీరంగంలో రారాజు చిరు. వరుస హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న చిరు ఆ తర్వాత ఖైదీ 150 మూవీతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సిస్టర్ సెంటిమెంట్ తోపాటు సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు చిరు బర్త్ డే. ఈ సందర్భంగా మెగాస్టార్ కు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దాదాపు 46 ఏళ్ల సినీ ప్రస్థానంలో చిరుకు మాత్రమే సాధ్యమైన రికార్డ్స్ ఏంటో తెలుసుకుందాం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.