Megastar Chiranjeevi: గ్రాండ్‏గా ప్రారంభమైన భోళా శంకర్.. చిరంజీవి సినిమా పూజా కార్యక్రమాలు లైవ్.. 

డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా భోళా శంకర్. తమిళ్ సూపర్ హిట్

Megastar Chiranjeevi: గ్రాండ్‏గా ప్రారంభమైన భోళా శంకర్.. చిరంజీవి సినిమా పూజా కార్యక్రమాలు లైవ్.. 
Chiranjeevi

Updated on: Nov 11, 2021 | 7:46 AM

డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా భోళా శంకర్. తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదాళం తెలుగు రీమేక్‏గా ఈ సినిమా రూపొందిస్తున్నారు. చిరంజీవి కెరీర్‏లో 155వ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‏గా నటించనుంది. తాజాగా ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో భోళా శంకర్ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించి సినిమాను ఘనంగా ప్రారంభించారు.

ఇక ఈనెల 15 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమా అన్నా చెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందించారు. ఇందులో చిరు చెల్లెలిగా కీర్తిసురేష్ నటిస్తుంది. చిరు బర్త్ డే సందర్భంగా.. భోళా శంకర్ టైటిల్ పోస్టర్, కీర్తి సురేష్.. చిరంజీవి బంధాన్ని తెలియజేస్తూ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ మరియు క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే భోళా శంకర్ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేయాలనీ మెగాస్టార్ కండీషన్ పెట్టారట. సినిమా చిత్రీకరణ కు ఎక్కువ సమయం తీసుకోకుండా మొత్తం 40 నుండి 50 వర్కింగ్ డేస్ లోనే ముగించేలా ప్లాన్ చేయాలని మెహర్ రమేష్ తో చెప్పినట్లుగా టాక్ వినిపిస్తుంది.

ఇక ప్రస్తుతం చిరంజీవి.. గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో కాజల్ హీరోయిన్‏గా నటించగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటించారు.

Also Read: Bigg Boss 5 Telugu: కేక్ తినేసిన సన్నీ.. రచ్చ చేసిన ఆనీ మాస్టర్.. ఇదేక్కడి గోల..

Keerthy Suresh: కీర్తిసురేష్‌లోని అద్భుతమైన టాలెంట్‌ను బయటపెట్టనున్న తమన్.. అదేంటంటే..

Anand Deverakonda: నా సినిమా కథలు నేనే సెలక్ట్ చేసుకుంటా.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన ఆనంద్ దేవరకొండ..