బాక్సాఫీస్ వద్ద ‘మన శంకరవరప్రసాద్ గారు’ దూకుడు.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా మన శంకరవరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. భారీ కలెక్షన్లు రాబడుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ మెగా మూవీ మూడు రోజుల వసూళ్లను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

బాక్సాఫీస్ వద్ద మన శంకరవరప్రసాద్ గారు దూకుడు.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Mana Shankaravaraprasad Garu Movie

Updated on: Jan 15, 2026 | 10:39 AM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా మన శంకరవరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. సంక్రాంతి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజే ఈ మెగా మూవీకి రూ. 84 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక తాజాగా ఈ సినిమా రూ. 150 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ మేరకు మూడు రోజులకు కలిపి మొత్తం రూ. 152 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. సినిమాకు మౌత్ టాక్ బాగుండడం, సంక్రాంతి పండగ సెలవులు వరుసగా ఉండడంతో మన శంకరవరప్రసాద్ గారు సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే.. నార్త్ అమెరికాలో ఫస్ట్ డే నే మన శంకరవరప్రసాద్ కు 1.7 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. రెండు రోజుల్లో 2 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు చిత్ర బృందం పేర్కొంది.

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా మన శంకరవరప్రసాద్ గారు సినిమాను నిర్మించారు. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరిశాడు. క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శరత్ సక్సేనా తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. భీమ్స్ స్వరాలు అందించారు. ఇక సినిమాలో చిరంజీవి కామెడీ హైలెట్ కాగా, హుక్ స్టెప్ సాంగ్ కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.

ఇవి కూడా చదవండి

 

ఓవర్సీస్ లోనూ రికార్డు కలెక్షన్లు..

 

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..