Ram Charan: వామ్మో.. ఇదేం క్రేజ్ అన్నా.. ఆస్ట్రేలియాలో చరణ్ కోసం ఎగబడ్డ అభిమానులు..

|

Aug 16, 2024 | 10:13 PM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు చరణ్ ఫ్యాన్ క్రేజ్ చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు.

Ram Charan: వామ్మో.. ఇదేం క్రేజ్ అన్నా.. ఆస్ట్రేలియాలో చరణ్ కోసం ఎగబడ్డ అభిమానులు..
Ram Charan
Follow us on

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు. మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన చరణ్.. అద్భుతమైన నటనతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటన చూసి హాలీవుడ్ మేకర్స్, విదేశీయులు సైతం ఆశ్చర్యపోయారు. దీంతో అటు వరల్డ్ వైడ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ముఖ్యంగా విదేశాల్లో చెర్రీ డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా తర్వాత మెగా హీరో నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు చరణ్ ఫ్యాన్ క్రేజ్ చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు.

తాజాగా రామ్ చరణ్ ఆస్ట్రేలియా వెళ్లాడు. ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఈవెంట్లో పాల్గొనడానికి చరణ్ నిన్న ఉదయం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ చేరుకున్నాడు. అక్కడి ఎయిర్ పోర్టులో చరణ్ కోసం చాలా మంది ఫ్యాన్స్.. అక్కడ ఉండే ఇండియన్స్ వచ్చి మెగా హీరోకు స్వాగతం పలికారు. అలాగే అక్కడ జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫార్ మెల్బోర్న్ ఈవెంట్ కోసం కూడా చాలా మంది అభిమానులు, ఇండియన్స్ తోపాటు ఆస్ట్రేలియా ప్రజలు కూడా హాజరయ్యారు. వేడుక అనంతరం చరణ్ తో ఫోటోస్ దిగడానికి, షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి జనాలు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఆస్ట్రేలియాలో చరణ్ క్రేజ్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

ఇదిలా ఉంటే.. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.