మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan).. చేసింది తక్కువ సినిమాలే అయినా తన నటనతో స్టార్ హీరోగా టాలీవుడ్ లో కంటిన్యూ అవుతున్నారు. కథకు ప్రధాన్యత ఉన్న పాత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు చరణ్. ఇక ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు చరణ్. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పటికే 1100 కోట్లకు పైగా వసూల్ చేసి దూసుకుపోతోంది ఈ సినిమా. ఈ సినిమా తోపాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో నటించారు చరణ్. ఈ సినిమాలో చిరు, చరణ్ ఇద్దరు నక్సలైట్స్ గా కనిపించనున్నారు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా RC 15 . టాప్ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే..
ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని కొందరు అంటుంటే మరికొందరు ఈ సినిమా సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాలో చరణ్ ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని కూడా టాక్ వినిపించింది. తాజాగా ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చారు రామ్ చరణ్. పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ధ్రువ సినిమాలో పోలీసు అధికారిగా నటించడం చాలా గర్వంగా ఉంది. శంకర్ గారితో చేస్తున్న సినిమాకూడా అలానే ఉంటుంది. ఈ సమాజంలో మనల్ని ఇస్పైర్ చేసిన ఎందరో ఆఫీసర్స్ ఆధారంగా నా సినిమా రూపొందుతోంది” అని అన్నారు. దాంతో చరణ్ శంకర్ సినిమా లై క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్ర అని ఇప్పటికే లీకైన పిక్స్ తో క్లారిటీ వచ్చింది. రెండోది పవర్ ఫుల్ అధికారి పాత్ర. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :