AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara Movie: ‘దేవర’ మూవీలో మరో హీరోయిన్.. ఎన్టీఆర్ జోడిగా మరాఠీ బ్యూటీ..

జనతా గ్యారేజ్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న ఈ మూవీ కావడంతో దేవరను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈసారి వీరిద్దరి కాంబోలో ఎలాంటి మ్యాజిక్ జరగనుందనే క్యూరియాసిటి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. రోజు రోజుకీ ఈ మూవీపై విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీతోనే తెలుగు అడియన్స్ ముందుకు రాబోతుంది జాన్వీ.

Devara Movie: 'దేవర' మూవీలో మరో హీరోయిన్.. ఎన్టీఆర్ జోడిగా మరాఠీ బ్యూటీ..
Devara, Shruti Marathe
Rajitha Chanti
|

Updated on: Feb 10, 2024 | 8:03 AM

Share

ఇప్పుడు యంగ్ టైగర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా ‘దేవర’.. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‏గా వస్తున్న ఈ మూవీలో తారక్ ఊర మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ చూస్తుంటే.. ఈసారి ఎన్టీఆర్‏ను ఓ రేంజ్ లో చూపించేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. జనతా గ్యారేజ్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న ఈ మూవీ కావడంతో దేవరను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈసారి వీరిద్దరి కాంబోలో ఎలాంటి మ్యాజిక్ జరగనుందనే క్యూరియాసిటి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. రోజు రోజుకీ ఈ మూవీపై విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీతోనే తెలుగు అడియన్స్ ముందుకు రాబోతుంది జాన్వీ. అలాగే ఈ సినిమాలో తారక్‏ను ఢీకొట్టే ప్రతినాయకుడిగా స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. వీరిద్దరు కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే. ఇదిలా ఉంటే… తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన మరో హీరోయిన్ కనిపించనుందట. దేవర సినిమాతోనే ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం కాబోతుందట. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా ?.. మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన నటి శృతి మరాఠేని మేకర్స్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కొరటాల తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో తారక్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని.. ఇందులో ఓ పాత్ర జోడిగా శృతి కనిపించనుందని టాక్. ఈ విషయం గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే.. బాలీవుడ్, మరాఠీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఇద్దరూ తారక్ సరసన కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

ఈ మూవీని ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ కొన్ని రోజులుగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ మూవీ రిలీజ్ వాయిదా పడిందని.. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఫస్ట్ పార్ట్ షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రాన్ని భారీ మొత్తంలో పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ కొత్త సినిమా చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..