ఛోటా రఫీ దొరికేశాడు !

కళాకారులకు నిజంగానే మరణం ఉండదు..ఎందుకంటే కళ ఎప్పుటికీ నిలిచిపోతుంది. లెజెండరీ సింగర్ మహ్మద్‌ రఫీ  ఈ లోకాన్ని విడిచి వెళ్లినా, ఆయన అద్భుతమైన గానం మాత్రం శ్రోతలను అలరిస్తూనే ఉంది. 

ఛోటా రఫీ దొరికేశాడు !

Updated on: Sep 12, 2020 | 9:49 PM

కళాకారులకు నిజంగానే మరణం ఉండదు..ఎందుకంటే కళ ఎప్పుటికీ నిలిచిపోతుంది. లెజెండరీ సింగర్ మహ్మద్‌ రఫీ  ఈ లోకాన్ని విడిచి వెళ్లినా, ఆయన అద్భుతమైన గానం మాత్రం శ్రోతలను అలరిస్తూనే ఉంది.  ఆయన పాటలు ఎప్పటికీ అజరామరాలే. ఎంతమంది గొప్ప గాయకులు వచ్చినా, ఆయన ప్లేస్ సెపరేట్ అంతే. మళ్లీ అలాంటి గాయకుడి పాటలు వినగలమా అని మదన పడుతూ ఉంటారు కొందరు.

అయితే కోళికోడ్‌కు చెందిన సౌరవ్‌ కిషన్‌ అనే 23 ఏళ్ల యువకుడు వారి కలను నెరవేర్చే ఛాన్స్ ఉందంటున్నారు వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ఆయన శనివారం ఓ వీడియోను రీ ట్వీట్‌ చేశారు. ‘‘కొన్ని దశాబ్దాలుగా కొత్త మహ్మద్‌ రఫీ కోసం మనం వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ ఎదురుచూపులు వీడే సమయం వచ్చినట్లుగా అనిపిస్తోంది… ఈ క్లిప్‌ ఆపలేకపోతున్నా’’అని రఫీ ఆలపించిన పాటను సౌరవ్‌ పాడిన తీరును ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us