Manjula Ghattamaneni: సోషల్ మీడియాలో ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పలేం.. విచిత్రమైన వీడియోలు, రకరకాల పాటలు నిత్యం నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో కచ్చా బాదం అనే పాట తెగ వైరల్ అవుతుంది. సరికొత్తగా రీల్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా లక్షలాది వ్యూస్ కూడా సంపాదిస్తున్నారు. సాధారణ యూజర్ల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కచ్చా బాదం (Kacha Badam) పాటకు పర్ఫామెన్స్ చేస్తుండటంతో ఈ పాట తెగ ట్రెండ్ అవుతుంది. ఈ పాట పై ఇప్పటికే పలువురు డాన్స్ చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
తాజాగా ఈ పాటకు నటి దర్శకురాలు, నిర్మాత, మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని డాన్స్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఎంతో ఉత్సాహంగా ఈ పాటకు స్టెప్పులేశారు మంజుల. సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ మంజుల చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం తమ సినిమా విశేషాలతోపాటు.. వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా కచ్చా బాదం పాటకు మంజుల వేసిన డాన్స్ వైరల్ అవుతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :