
స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియన్ సెల్వన్ 2. గతంలో వచ్చిన పీఎస్ 1 చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తి కలిగించింది. ఇందులో విక్రమ్ చియాన్, కార్తి, జయం రవి, శోభితా ధూళిపాళ్ల, త్రిష, ఐశ్వర్య రాయ్ కీలకపాత్రలలో నటించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. పొన్నియన్ సెల్వన్ సినిమా నిజానికి ఎప్పుడో రావాల్సింది కానీ ఆలస్యం అయ్యింది. కరోనా కారణంగా ఈ సినిమాకు చాలా గ్యాప్ వచ్చింది. మొత్తంగా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ప్రముఖ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించారు మణిరత్నం.
ఇక ఇప్పుడు రెండో పార్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అన్ని ప్రాంతాలనుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. పార్ట్2లో కూడా కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య లక్ష్మీ, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం నటించారు.
ఇక ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడవుతుందా అని కొంతమంది ఎదురుచూస్తున్నారు. తొలి భాగాన్ని దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. సీక్వెల్ ఓటీటీ రైట్స్ ని కూడా సొంతం చేసుకుంది. పొన్నియన్ సెల్వన్ సీక్వెల్ 6-7 వారాల తర్వాతే స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది.