Manchu Family: ఎక్స్‌లో చెలరేగిపోతున్న మంచు బ్రదర్స్.. సింహం, కుక్కలతో కంపార్ చేస్తూ..

మనోజ్‌ ఆగడు...విష్ణు తగ్గడు. మంచు వర్సెస్‌ మంచు ఫైట్‌....కంచులా మోత మోగుతోంది. మంచు ఫ్యామిలీలో మంట ఇంకా అలాగే రగులుతూనే ఉంది. ఆ ఫ్యామిలీ డ్రామాకు సంబంధించిన మరో అప్ డేట్ ఇది. బ్రదర్స్ ఇద్దరూ తాజాగా ఎక్స్‌లో వార్‌కి దిగారు. సినిమా డైలాగ్స్ పేల్చుతూ రచ్చ చేస్తున్నారు.

Manchu Family: ఎక్స్‌లో చెలరేగిపోతున్న మంచు బ్రదర్స్.. సింహం, కుక్కలతో కంపార్ చేస్తూ..
Manchu Vishnu - Manchu Manoj

Updated on: Jan 17, 2025 | 7:09 PM

మంచు బ్రదర్స్‌ మధ్య మరోసారి ట్వీట్స్‌ వార్‌ నడుస్తోంది. పోటాపోటీ ట్వీట్స్‌తో మరోసారి హల్‌చల్‌ చేస్తున్నారు..మంచు సోదరులు. తాను నటించిన రౌడీ చిత్రంలోని ఓ డైలాగ్‌ ఆడియోను ట్వీట్‌లో షేర్‌ చేసిన మంచు విష్ణు..తన ఫేవరేట్‌ డైలాగ్స్‌లో ఇది ఒకటని చెప్పారు. “‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది..కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ’ అనే డైలాగ్‌ను మంచు విష్ణు షేర్ చేశారు.

మంచు విష్ణు ట్వీట్‌ చేసిన కాసేపటికే..ట్విటర్‌లో రియాక్ట్‌ అయ్యారు ఆయన సోదరుడు మంచు మనోజ్‌. కృష్ణం రాజులా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్‌ కుక్కకు ఉంటుందన్న మనోజ్‌..ఈ విషయం ఇదే జన్మలో తెలుసుకుంటావ్ అంటూ పోస్ట్‌ చేశారు. అంతేకాదు మోహన్ బాబు చెప్పిన మరో డైలాగ్‌ను ట్వీట్ చేస్తూ.. చురకలు అంటిచారు.

టాలీవుడ్ నటుడు మోహన్ బాబు కుటుంబంలో వివాదం మరింత ముదురుతోంది. గతంలో జల్‌పల్లిలోని నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మంచు మనోజ్‌, మోహన్‌ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత తలెత్తిన పరిణామాలతో మోహన్ బాబు ఆస్పత్రి పాలయ్యారు. ఇటీవల సంక్రాంతి వేడుకల్లో కూడా మంచు విష్ణుతో కలిసి మోహన్ బాబు కూడా పాల్గొన్నారు. అంత బాగుందనుకున్న తరుణంలో మరోసారి వివాదం మొదలైంది. పండుగ వేళ మంచు మనోజ్, మౌనిక దంపతులు తిరుపతి రంగంపేటలోని మోహన్ బాబుకు యూనివర్సీటికి వెళ్లడంతో మళ్లీ గొడవ మొదలైంది. మనోజ్ దంపతులను లోపలికి అనుమతించక పోవడంతో ఆయన అనుచరులు గేటు పైకి ఎక్కి లోపలికి ప్రవేశించారు. మనోజ్‌కు అనుమతి లేదని చెప్పడంతో ఇరువర్గాల దూషణకు దిగాయి. ఈ వ్యవహారం కూడా కేసుల వరకూ వెళ్లింది. ఈ గొడవల నేపథ్యంలో మంచు బ్రదర్స్‌ మధ్య ట్వీట్స్‌ వార్‌..మరోసారి వైరల్‌గా మారింది.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి