మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్-MAAకు కొత్త టీమ్ వచ్చేసింది. మంచు విష్ణు ప్యానెల్ కొలువు దీరింది. ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు ప్రమాణం చేశారు. విష్ణుతోపాటు మొత్తం 15 మంది సభ్యులతో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రమాణం చేయించారు. మంచు విష్ణు ప్యానెల్ నుంచి 15మంది గెలిచారు. జనరల్ సెక్రటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రటరీగా గౌతంరాజు, వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి, ట్రెజరర్‌గా శివబాలాజీ విక్టరీ కొట్టారు. ఈసీ మెంబర్స్‌గా గీతాసింగ్, అశోక్ కుమార్, శ్రీలక్ష్మి, సి.మాణిక్, శ్రీనివాసులు, హరనాథ్‌బాబు, శివన్నారాయణ, సంపూర్ణేష్‌బాబు, శశాంక్, బొప్పన విష్ణు విజయం సాధించారు. వీళ్లంతా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ‘మా’ ఆఫీసులో విష్ణు తన టీమ్‌తో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విష్ణు ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా వచ్చారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులూ అటెండ్ అయ్యారు. విష్ణు టీమ్‌కు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు మంత్రి తలసాని. తర్వలోనే సీఎం కేసీఆర్ వద్దకు ఆహ్వానిస్తామన్నారు.
అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు జరిగాయి. మొత్తం 26 పదవుల కోసం విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్స్ హోరాహోరీగా తలపడ్డాయి. జనరల్ ఎలక్షన్స్‌ను తలపించే రేంజ్‌లో హామీలు గుప్పించారు. మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. డైలాగ్ వార్ కూడా ఓ రేంజ్‌లో నడిచింది. అయితే రిజల్ట్స్ తర్వాత రాజీనామాలతో ట్విస్ట్ ఇచ్చింది ప్రకాష్ ప్యానల్. మొత్తం 11 మంది రిజైన్ చేశారు. దీంతో విష్ణుప్యానల్‌కు చెందిన 15 మంది మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. మరి ఖాళీ అయిన 11 పోస్టుల విషయంలో ప్రెసిడెంట్ విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ప్రకాష్ రాజ్ టీమ్‌ను బుజ్జగిస్తారా? లేక కొత్త వారిని నామినేట్ చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.! ప్రస్తుత పరిస్థితులను చూస్తే..ప్రకాష్ ప్యానల్ రాజీనామాలను వెనక్కి తీసుకునే ఛాన్స్ అయితే కనిపించడం లేదు.
Also Read: పండుగ తర్వాత భారీ విద్యుత్ కోతలంటూ ఏపీలో ప్రచారం.. ఇందన శాఖ క్లారిటీ
నిద్రిస్తోన్న భర్త మర్మాంగంపై సల సలా కాగుతోన్న వేడినీళ్లు పోసిన భార్య…