Manchu Vishnu: మంచు విష్ణు సంచలన ప్రెస్‌మీట్.. పవన్, చిరంజీవి సహా కీలక విషయాలపై కామెంట్స్

|

Oct 18, 2021 | 12:06 PM

'మా' నుంచి మరో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ప్రకాశ్ రాజ్ ప్యానల్ రాజీనామాలు అందలేదన్న అధ్యక్షుడు మంచు విష్ణు.. లేఖలు తనకు చేరిన తర్వాత స్పందిస్తానన్నారు.

Manchu Vishnu: మంచు విష్ణు సంచలన ప్రెస్‌మీట్.. పవన్, చిరంజీవి సహా కీలక విషయాలపై కామెంట్స్
Manchu Vishnu
Follow us on

‘మా’ నుంచి మరో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ప్రకాశ్ రాజ్ ప్యానల్ రాజీనామాలు అందలేదన్న అధ్యక్షుడు మంచు విష్ణు.. లేఖలు తనకు చేరిన తర్వాత స్పందిస్తానన్నారు. ఇక ఆదివారం జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో తాను, పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నామని చెప్పారు. పవన్‌తో ఏం మాట్లాడానే విషయం తనకు తెలుసన్నారు. ఇది మన తల్లి జాగ్రత్తగా చూసుకో విష్ణు అని పవన్ తనకు చెప్పారని విష్ణు వెల్లడించారు. అక్కడ భారత ఉపరాష్ట్రపతి సమక్షంలో ఒక మంచి ప్రోగ్రాం జరిగిందని.. తాము ప్రోటోకాల్ పాటించామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పోటీ చేయొచ్చని క్లారిటీ ఇచ్చారు. తెలుగు వాళ్ళు మాత్రమే ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేయాలని తాము ఎక్కడా ప్రకటించలేదని చెప్పారు.  చిరంజీవి-మోహన్ బాబు ఎన్నికల అనంతరం ఫోన్‌లో మాట్లాడుకున్నారని మంచు విష్ణు తెలిపారు. జర్నలిజాన్ని భ్రష్టు పట్టించే ఒక జర్నలిస్ట్ ఒక డబ్బింగ్ సినిమాలో నటించి ‘మా’ సభ్యుడయ్యారని.. ఆ జర్నలిస్ట్ వల్లే ‘మా’ లో వివాదాలు మొదలయ్యాని విష్ణు కామెంట్ చేశారు.

‘మా’..లో నవరసాలను మించిన సీన్లు రక్తికట్టిస్తూనే ఉన్నాయి. అసోసియేషన్‌లో ఇమడలేమని ప్రకాష్‌రాజ్ ప్యానల్‌ నుంచి గెలిచిన సభ్యులు రాజీనామాలు ప్రకటించారు. కానీ అదంతా ఒట్టి డ్రామానేనా? చిత్తశుద్దితో రాజీనామా చేస్తే ‘మా’ అధ్యక్షుడికి అవి ఎందుకు చేరలేదు? కావాలనే సీన్ క్రియేట్ చేశారా? బుజ్జగింపులతో మెత్తబడాలని కథ అల్లేశారా? అసలు మోనార్క్ అండ్‌ కో ప్లానేంటి? రాజీనామాల రచ్చేంటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్ సభ్యుల రాజీనామాలపై ఫస్ట్ టైమ్ స్పందించారు ‘మా’ అధ్యక్షుడు విష్ణు. అసలా మ్యాటర్ తన దాకా రాలేదని స్పష్టం చేశారు. రాజీనామాలపై క్లిస్టర్ క్లియర్‌గా మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. దీంతో ప్రకాష్‌ రాజ్ ప్యానల్ కేవ‌లం రాజీనామాలు చేస్తున్నామ‌ని బెదిరించారా? నిజంగా రాజీనామాలు చేయ‌లేదా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఎన్నిక‌లు అయిన వెంటనే మోహ‌న్ బాబు త‌మ‌పై దాడి చేశార‌ని, బూతులు తిట్టార‌ని ఆరోపిస్తూ రాజీనామాలు చేశారు. కానీ వాటిని ఎందుకు ‘మా’ ఆఫీస్‌కు పంపించలేదన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల రోజు సీసీ ఫుటేజ్ కావాలని  ప్రకాష్‌ రాజ్‌ డిమాండ్ చేసిన నేపథ్యంలో నేడు రెండు వర్గాల సమక్షంలో సీసీ ఫుటేజ్ చెక్ చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read:పండక్కి అత్తగారింటకి వచ్చి బైక్స్‌కు ఫైన్ వేసిన ఎస్సై… గ్రామస్తులు ఏం చేశారంటే