నాకు అలా నటించడం రాదు.. నా హైట్, స్ట్రక్చర్‌కు తగిన బాడీ డబుల్ దొరకడం లేదు.. మంచు విష్ణు కామెంట్స్

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం కన్నప్ప. మహా భారతం సీరియల్ ఫేమ్, ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నారు.

నాకు అలా నటించడం రాదు.. నా హైట్, స్ట్రక్చర్‌కు తగిన బాడీ డబుల్ దొరకడం లేదు.. మంచు విష్ణు కామెంట్స్
Manchu Vishnu

Updated on: Jun 06, 2025 | 7:31 PM

మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ సినిమా కన్నప్ప. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటీనటులు నటిస్తున్నారు. నటుడు డాక్టర్ మోహన్ బాబు కన్నప్ప సినిమాలో నటిస్తూ.. నిర్మిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ కు  ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, సప్తగిరి, రఘు బాబు, , దేవరాజ్, మంచు అవ్రామ్( విష్ణు కొడుకు), అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) ఇలా ఎందరో స్టారాది స్టార్స్ ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు.

తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్.. ఇలా పలు ప్రాంతీయ భాషల్లో కన్నప్ప సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు మూవీ టీమ్. ముఖ్యంగా మంచు విష్ణు వరుసగా ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అలాగే పలు ఇంటర్వ్యూల్లో మంచు విష్ణు మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కన్నప్ప సినిమా గురించి, అలాగే సినిమాలో నటిస్తున్న నటీనటుల గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు విష్ణు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ.. అభిమానుల ముందు నటించడం తనకు రాదు అని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ.. తన యాటిట్యూడ్ గురించి మాట్లాడారు. నాకు యాటిట్యూడ్ అనేది పుట్టుకతో వచ్చింది. అది చాలా మందికి నచ్చుతుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే స్వభావం నాది. నాలు అభిమానుల ముందు నటించడం రాదు అందుకే చాలా మంది అభిమానులను పోగొట్టుకున్నా అన్నారు విష్ణు. నేను ఎప్పుడూ జెన్యూన్ గానే ఉంటాను అంటూ చెప్పుకొచ్చారు విష్ణు. ఇక చాలా మంది హీరోలు బాడీ డబుల్ ను ఉపయోగిస్తారు. కొన్నియాక్షన్ సీక్వెన్స్ లో బాడీ డబుల్ ను ఉపయోగిస్తూ ఉంటారు. దీని పై విష్ణు మాట్లాడుతూ.. నా హైటు స్ట్రక్చర్ కు తగిన బాడీ డబుల్ ఇంకా దొరకలేదు అన్నారు. అయితే మోహన్ బాబు నెక్స్ట్ సినిమాకు సంబంధించి బాడీ డబుల్ ను రెడీ చేసినట్టు రివిల్ చేశారు విష్ణు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి