యంగ్ హీరో మంచు విష్ణు ఓ స్క్రీన్ షాట్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ డే సందర్భంగా తన 4am ఫ్రెండ్ ఎవరో రివీల్ చేశారు విష్ణు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారు.. నందమూరి కల్యాణ్ రామ్. యస్… మంచు విష్ణుకి ఉదయం 4 గంటల సమయంలో కాల్ చేసి మాట్లాడారు కల్యాణ్ రామ్. విష్ణు షేర్ చేసిన స్క్రీన్ షాట్ చూసిన తరువాత నెట్టింట కొత్త డిస్కషన్ మొదలైంది. అంత ఉదయాన్ని ఇద్దరూ ఎందుకు లేచారా అన్న డౌట్స్ రెయిజ్ అయ్యాయి. అయితే ఈ డౌట్‌కు కూడా విష్ణు స్క్రీన్ షాట్‌లోనే ఆన్సర్ కనిపించింది. కల్యాణ్ రామ్ తరువాత జిమ్ సంపత్ అనే వ్యక్తి కూడా మంచు విష్ణుకు కాల్ చేశారు. సో ఇద్దరు ఉదయాన్నే వర్కవుట్స్ చేస్తున్నారని ఫిక్స్ అయ్యారు ఫాలోవర్స్.
ఢీ2 కోసం ఫిట్ బాడీ రెడీ చేస్తున్నా అంటూ చాలా రోజులుగా చెప్తున్నారు మంచు విష్ణు. ఈ మధ్యే బింబిసారా ఫస్ట్ లుక్ వదిలిన కల్యాణ్ రామ్ కూడా వారియర్ లుక్ కోసం కండలు పెంచే పనిలో ఉన్నారు. ఈ ఇద్దరు ఒకే వ్యక్తి దగ్గర ఆన్‌లైన్ ట్రైనింగ్ తీసుకుంటున్నారేమో అన్న కంక్లూజన్‌కు వచ్చేశారు.
ఈ ముచ్చట పక్కన పెడితే విష్ణు షేర్ చేసిన స్క్రీన్ షాట్‌లో మరిన్ని ఇంట్రస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ‘మంచు లయన్ కింగ్’ పేరుతో ఓ నెంబర్ సేవ్ చేసుకున్నారు విష్ణు.. మరి ఆ లయన్ కింగ్ ఎవరు… మోహన్ బాబేనా…? లేకపోతే.. ఇంట్లో ఇంకెవరి పేరైనా అలా ముద్దుగా సేవ్ చేసుకున్నారా..? అలాగే బార్న్ ఇరిటేటెడ్ అంటూ మరో నెంబర్ కూడా కనిపించింది. దీంతో విష్ణుని అంతగా ఇరిటేట్ చేసే ఆ పర్సన్ ఎవరా? అని ఆరాలు తీసే పనిలో ఉన్నారు నెటిజెన్స్.
Also Read: పవర్ స్టార్ రేంజ్ అంటే ఇది… పీఎస్‌పీకే 28 నేషనల్ లెవల్‌లో ట్రెండింగ్