Vishnu Manchu: అలాంటి వారిని భగవంతుడే కాపాడాలి.. మంచు విష్ణు కామెంట్స్

|

May 23, 2023 | 8:14 AM

మంచు విష్ణు వెన్నెల కిషోర్ ను ఉద్దేశిస్తూ.. చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఆర్బీఐ 2000 రూపాయల నోటును రద్దు  చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో వెన్నెక కిషోర్ ఇంట్లో 2000 నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయంటూ.. ఓ ఫోటోను షేర్ చేశారు.

Vishnu Manchu: అలాంటి వారిని భగవంతుడే కాపాడాలి.. మంచు విష్ణు కామెంట్స్
Manchu Vishnu
Follow us on

నటుడు వెన్నెల  కిషోర్ కు ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిలో మంచు విష్ణు ఒకరు. ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే తాజాగా మంచు విష్ణు వెన్నెల కిషోర్ ను ఉద్దేశిస్తూ.. చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఆర్బీఐ 2000 రూపాయల నోటును రద్దు  చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో వెన్నెక కిషోర్ ఇంట్లో 2000 నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయంటూ.. ఓ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో నెటిజన్స్ అంతా దీని పై చర్చించుకుంటున్నారు. దీని పై తాజాగా మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు.

ఈ మేరకు మంచు విష్ణు ట్వీట్ చేశారు. నాకు వెన్నెల కిషోర్ కు మంచి స్నేహం ఉంది. నేను ఆ ఫోటోను జోక్ గా షేర్ చేశా.. అన్నారు. అది కేవలం జోక్ అంతే.. నాకు వెన్నెల కిషోర్ కు మధ్య ఇలా ఫన్నీ ఫైట్స్ జరుగుతాయి.. అందుకే నేను ఆ ఫోటోను షేర్ చేశా.. కానీ కొంత మంది దాన్ని వేరేలా అర్ధం చేసుకుంటున్నారు.

హ్యూమర్ సెన్స్ ఉన్నవాళ్లకు నేను జోక్ చేశానని అర్ధమవుతుంది. ఎవరికైతే అది జోక్ అని అర్ధం కాదో వాళ్ళను ఆ దేవుడే కాపాడాలి అని అన్నారు మంచు విష్ణు.