Manchu Lakshmi: ఎట్టకేలకు నెరవేరబోతున్న మంచు లక్ష్మీ కల.. ఈరోజు కోసం ఎదురుచూస్తున్నానంటూ..

|

Feb 12, 2022 | 4:59 PM

డైలాగ్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు మంచు లక్ష్మి (Manchu Lakshmi).

Manchu Lakshmi: ఎట్టకేలకు నెరవేరబోతున్న మంచు లక్ష్మీ కల.. ఈరోజు కోసం ఎదురుచూస్తున్నానంటూ..
Manchu Lakshmi
Follow us on

డైలాగ్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు మంచు లక్ష్మి (Manchu Lakshmi). అందం, అభినయంతో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కేవలం నటిగానే కాకుండా.. నిర్మాతగానూ రాణించింది మంచు లక్ష్మీ.. అయితే ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో కీలకపాత్రలలో నటించిన మంచు లక్ష్మీ.. మొదటి సారి తన తండ్రి మోహన్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ & మంచు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యింది. మహిళా దర్శకురాలు నందినిరెడ్డి ఫస్ట్ షాట్‏కి దర్శకత్వం వహించగా, మంచు మనోజ్ కెమెరా స్విచ్ఛాన్ చేసారు. మంచు అవరామ్, మంచు విద్యా నిర్వాణ స్ర్కిఫ్ట్ అందజేసారు. మొట్టమొదటిసారి ‘పద్మశ్రీ’ డా॥ మోహన్ బాబు, మంచు లక్ష్మీప్రసన్న ఈ చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.మళయాళం స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సిద్దిక్ కీలక పాత్ర పోషించబోతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహించబోతున్నారు. డైమండ్ రత్నబాబు స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి కెమెరామెన్ సాయిప్రకాష్, మ్యూజిక్ ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం.

Mohan Babu

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ – “ఇది ఒక స్టన్నింగ్ క్రైమ్ థ్రిల్లర్. పద్మశ్రీ డా॥ మోహన్ బాబు, మంచు లక్ష్మి మునుపెన్నడూ కనిపించని పాత్రల్లో కనిపించనున్నారు. మార్చ్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాం” అని చెప్పారు.

అలాగే తన తండ్రితో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మంచు లక్ష్మి ట్విట్టర్ ద్వారా తెలిపింది.

Also Read: Sudheer Babu: కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించిన సుధీర్‌ బాబు.. ఆసక్తికరంగా ఫస్ట్‌ లుక్‌..

Meenakshi Chaudhary: వరుస అవకాశాలు అందుకుంటున్న హర్యానా బ్యూటీ “మీనాక్షి చౌదరి”..(ఫొటోస్)

Geetha Madhuri: సెంటర్ అఫ్ ఎట్రాక్షన్ ‘గీత మాధురి’ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో సింగర్ లేటెస్ట్ ఫొటోస్..

Keerthy Suresh : మహేష్ సినిమాకోసం ఈ ముద్దుగుమ్మ మొదటిసారి అలా కనిపించనుందట..