Manchu family fight: జలపల్లిలోని మంచు టౌన్ దగ్గర రచ్చ.. గేట్లు తోసుకుని లోపలికి వెళ్లిన మనోజ్‌

మంచు ఫ్యామిలీ రచ్చ రోడ్డుకెక్కింది. మోహన్ బాబు పై మనోజ్.. అలాగే మనోజ్ పై మోహన్ బాబు ఒకరి పై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తన భార్య పిల్లల పై దాడి చేశారని మనోజ్ ఆరోపిస్తున్నారు.

Manchu family fight: జలపల్లిలోని మంచు టౌన్ దగ్గర రచ్చ.. గేట్లు తోసుకుని లోపలికి వెళ్లిన మనోజ్‌
Manoj

Updated on: Dec 10, 2024 | 7:42 PM

మంచు ఫ్యామిలీ రచ్చ రోడ్డుకెక్కింది. మోహన్ బాబు పై మనోజ్.. అలాగే మనోజ్ పై మోహన్ బాబు ఒకరి పై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తన భార్య పిల్లల పై దాడి చేశారని మనోజ్ ఆరోపిస్తున్నారు. తాజాగా జలపల్లి లోని మంచు టౌన్ కు చేరుకున్న మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు. మంచు మనోజ్ వాహనాన్ని గేట్ దగ్గరే బౌన్సర్లు ఆపేశారు. దాంతో మనోజ్ ఆగ్రహంతో ఊగిపోయారు. గేట్లు బద్దలు కొట్టుకుంటూ మనోజ్ లోపలి దూసుకుపోయారు. అడ్డుకున్న సిబ్బంది పై మనోజ్ వాగ్వాదానికి దిగారు.  ప్రస్తుతం అక్కడ గందరగోళం నెలకొంది.

అడిషనల్‌ డీజీని కలిశారు మంచు మనోజ్. రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలపై వివరణ ఇచ్చారు. తనకు ప్రాణహాని ఉందని మంచు మనోజ్‌ ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని మనోజ్ దంపతులు కోరారు. అయితే రాచకొండ సీపీని కలవాలని  మహేష్‌ భగవత్ సూచించారని తెలుస్తోంది.