
తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాల్లో ‘మనసంతా నువ్వే’ ఒకటి. అడియన్స్ హృదయాలను హత్తుకున్న మూవీ ఇది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ. ఈ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేక అభిమానులు ఉన్నారు. దివంగత హీరో ఉదయ్ కిరణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ వి.ఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా 2001లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఇందులో ఉదయ్ సరసన రీమా సేన్ నటించింది. ఇందులో అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది రీమా సేన్. అదే ఏడాదిలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘మిన్నెలే’ చిత్రంతో తమిళ చిత్రసీమలో నటిగా రంగప్రవేశం చేసింది. తెలుగు , తమిళంలోనే కాకుండా బెంగాలీ, కన్నడ భాషలలో పలు చిత్రాల్లో నటించింది. 1981 అక్టోబర్ 29న కోల్ కత్తాలో జన్మించిన రీమాసేన్.. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అనేక ప్రకటనలలో నటించింది.
ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషలలో పలు చిత్రాలు చేసింది. ఆ తర్వాత ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. 2012లో వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్ ను వివాహం చేసుకున్నారు రీమాసేన్. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం ఆమె తన ఫ్యామిలీతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. రీమాసేన్ ఫిబ్రవరి 22, 2013న బాబుకు జన్మనిచ్చారు. తమ కొడుకుకు రుద్రవీర్ అని నామకరణం చేశారు.
సినిమాలకు పూర్తిగా దూరమైన రీమాసేన్.. అటు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండరు. ఎప్పుడో ఒకసారి తమ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను పంచుకుంటారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం తన ఫ్యామిలీ పిక్ షేర్ చేసింది రీమాసేన్. అందులో తన భర్త, కుమారుడితో కలిసి ఎంతో సంతోషంగా చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. అయితే రీమాసేన్ కొడుకు ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మనసంత నువ్వే హీరోయిన్ కు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా ? అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. రీమా సేన్ ఫ్యామిలీ ఫోటోస్ మీరు చూసేయ్యండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.