
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ కు ఆడియెన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో ఫ్యామిలీలంతా బుక్ చేసుకుని మరీ చిరంజీవి సినిమాకు వెళుతున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవికి జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. వీరితో పాటు ఈ సినిమాలు పలువురు స్టార్స్ నటించారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యామియో రోల్ లో అదరగొట్టగా క్యాథరీన్ థెరీసా, అభినవ్ గోమఠం, జరీనా వాహబ్, సచిన్ ఖేడ్కర్, హర్షవర్దన్ ఇలా చాలామంది ఫేమస్ యాక్టర్స్ ఈ మూవీలో భాగమయ్యారు. ఈ మెగా మూవీలో చిరంజీవి ఇద్దరు పిల్లల తండ్రిగా కనిపించారు. చిరంజీవి కొడుకుగా ఊహ అనే పాప నటించగా, కూతురుగా ఖుషి అనే ఛైల్డ్ ఆర్టిస్ట్ నటించింది. ఈ ఇద్దరూ కూడా ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నారు. ముఖ్యంగా ఖుషి సినిమాలో
తన నటనతో ఆడియెన్స్ తో కన్నీళ్లు తెప్పించింది. దీంతో ఈ అమ్మాయి ఎవరని తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖుషి కూడా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది.
మాది రాజస్థాన్. రెండేళ్ల క్రితం హైదరాబాద్ కి వచ్చాం. నాకు నాన్న లేరు. ఒక బ్రదర్ ఉన్నాడు. మా ఇద్దర్ని మా అమ్మే చూసుకుంటుంది. నేను ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్నాను. మా అమ్మ కూడా నేను చదివే స్కూల్ లోనే పనిచేస్తుంది. మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో అందులోనూ మెగాస్టార్ చిరంజీవి కూతురిగా నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ లో చిరంజీవిని నాన్న అని పిలిచినప్పుడు ఒక్కోసారి బాగా ఎమోషనల్ అయ్యేదాన్ని. ఏడుపు కూడా వచ్చేది. నాకు కూడా అలాంటి తండ్రి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. చిరు సర్ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. మాకు కేక్స్, చాక్లెట్స్ తెచ్చిచ్చేవారు. చిరంజీవితో ఇంకోసారి నటించే ఛాన్స్ రావాలని కోరుకుంటున్నా’
‘ నయనతారతో కూడా మంచి బాండింగ్ ఏర్పడింది. ఆమెను నేను అక్క అని పిలుస్తాను. ఎందుకంటే తను చాలా యంగ్‌గా కనిపిస్తారు. నయన్ గారు మాకు దుస్తులు కూడా కొనిచ్చారు. మన శంకరవరప్రసాద్ గారు సినిమాను మేము ఎప్పటికీ మర్చిపోలేను’ అని ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది ఖుషి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.