ప్రేమలు ఫేమ్ మమిత బైజు నటించిన తాజా చిత్రం డియర్ కృష్ణ. ఎన్ బలరామ్ తెరకెక్కించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు. ఐశ్వర్య మరో కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న డియర్ కృష్ణ సినిమా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. మేకర్స్. స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ డియర్ కృష్ణ ట్రైలర్ ను రిలీజ్ చేసి చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘డియర్ కృష్ణ ట్రైలర్ చాలా బాగుంది. ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కచ్చితంగా ఘన విజయం సాధించాలి’ అంటూ విషెస్ చెప్పారు. కాగా ఇదే ఈవెంట్ లో చిత్ర బృందం ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. సినిమా టికెట్ బుక్ చేసుకున్న వారికి అక్షరాల పదివేలు గెలుచుకునే సదావకాశాన్ని కల్పించింది. మొదటి 100 టికెట్ల బుకింగ్‌లో ఒక టికెట్‌ను ఎంపిక చేసి ఆ టికెట్ దారుడికి రూ. 10000 క్యాష్ బ్యాక్ కింద నగదు బహుమతిగా అందించనున్నట్ల చిత్ర బృందం ప్రకటించింది. ఈ ప్రక్రియను వారం రోజుల పాటు కొనసాగించనున్నట్లు చెప్పుకొచ్చారు మేకర్స్.
కాగా శ్రీకృష్ణుడికి.. ఆయన భక్తుడికి మధ్య జరిగిన ఓ అద్భుత సంఘటనను ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందంటున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కూడా మెచ్చుకున్నారన్నారు. కాగా డియర్ కృష్ణ సినిమాకు హరి ప్రసాద్ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోన్న ఈ చిత్రం గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు మమిత బైజు నటించిన #DearKrishna సినిమా చూశారు. ఈ సినిమా కాన్సెప్ట్‌కు అభినందనలు తెలిపారు. జనవరి 24న విడుదల. pic.twitter.com/FNlzK88PeR
— • (@PrasadShettty) January 13, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.