Malayalam Director: చలన చిత్ర పరిశ్రమలో తరచుగా లైంగిక వేధింపులు వివాదాలు తెరమీదకు వస్తూ సంచలనం అవుతూనే ఉన్నాయి. తాజాగా మలయాళం చిత్ర పరిశ్రమలో మరో వివాదం నెలకొంది. రాబోయే మలయాళ చిత్రం “పడవెట్టు( Padavettu) దర్శకుడు లిజు కృష్ణ(director Liju Krishna)ను అత్యాచారం ఆరోపణలపై ఆదివారం కేరళలోని కన్నూర్ నుండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కొచ్చిలోని మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరచనున్నారు. ఈ వివాదం మాలీవుడ్ పరిశ్రమలో సంచలనంగా మారింది. పడవెట్టు సినిమాకు సంబంధించిన అంశాల్లో లిజు కృష్ణకు సహకరించిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కాకనాడ్ ఇన్ఫోపార్క్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మంజు వారియర్, అదితి బాలన్, నివిన్ పౌలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని నటుడు సన్నీ వేన్ నిర్మించారు.
పెదవెట్టు సినిమాతో దర్శకుడిగా లిజు కృష్ణ వెండి తెరకు పరిచయం కనున్న్నాడు. ఇదే అతని తొలి చలనచిత్రం. ఈ సినిమాకి స్క్రిప్ట్ కూడా రాసుకున్నాడు. ఇంతకుముందు.. సన్నీ వేన్, లిజు కలిసి మూమెంట్ జస్ట్ బిఫోర్ డెత్ అనే నాటకానికి పనిచేశారు. ఈ నాటకానికి సన్నీ దర్శకత్వం వహించగా, లిజు నిర్మించారు.
కస్టడీలోకి తీసుకున్న సమయంలో లిజు స్వస్థలం కన్నూర్‌లో పడవెట్టు షూటింగ్ కొనసాగుతోంది. దర్శకుడు అరెస్ట్ తో పెదవెట్టు మూవీకి సంబంధించిన తదుపరి పనులు ఆగిపోయాయి. ఈ సినిమాకు సంబంధించిన పనులు పూర్తి చేసి.. ఈ ఏడాదిలోనే పెదవెట్టు విడుదల చేయాలని భావించారు. కొచ్చిలో టాటూ ఆర్టిస్ట్‌పై వరుస లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన వెంటనే ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
ఇదే విషయంపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ..లిజు కృష్ణను ఐపిసి 376 సెక్షన్ కింద అరెస్టు చేశాం. అయితే ఫిర్యాదు చేసిన యువతి సినిమాకు చెందిన వ్యక్తి కాదని.. ఆ యువతికి చెందిన వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఆ యువతితో లిజు కృష్ణకు కొన్నాళ్లుగా పరిచయం ఉందని చెప్పారు.
Also Read: