ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ (RRR) సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ భారతదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు.. జక్కన్న స్క్రీన్ ప్లేకు ప్రపంచమే ఫిదా అయ్యింది. ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ సినిమాపై హాలీవుడ్ డైరెక్టర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలలో నటించి మెప్పించారు. అంతేకాకుండా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. అజయ్ దేవగణ్, శ్రియా, సముద్రఖని కీలకపాత్రలలో నటించారు. అయితే ఇటీవల ఈ సినిమాలోని పలు సన్నివేశాలను ఎలా చిత్రీకరించారనే విషయాలను రివీల్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే తారక్, పులి ఫైట్ సీన్.. బ్రిటిష్ కోటలో తారక్ ఎంట్రీ.. వ్యాన్ నిండుగా పులులు, నక్కలను ఎలా తీసుకువచ్చారనే సీన్స్ గురించి అసలు విషయం చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మాయజాలం గురించి బయటపెట్టేశారు జక్కన్న.
సెకండ్ హాఫ్‌లో తన బావ రామరాజు కోసం హత్రాస్ వచ్చిన సీత.. తన స్నేహితుడి కోసం రామారాజు బంధీగా ఉండిపోయారని.. మరో రెండు రోజుల్లో ఉరి తీస్తున్నారనే విషయాం భీం కుటుంబానికి చెప్పే సీన్ గుర్తుంది కదా. ఆ సన్నివేశంలో తారక్, అలియా నటన ప్రేక్షకుల మనసులను తాకింది. అయితే ఈ సన్నివేశం మొత్తం కూడా ఓ నైట్ ఎఫెక్ట్ లో ఒక సత్రం సెట్టింగ్‌లో తీశారు. ఆ సీన్ తాలుకూ కాన్సెప్ట్ ఆర్ట్, టెస్ట్ షూట్, ఫైనల్ షాట్ ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది చిత్రయూనిట్. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ చూస్తుంటే.. జక్కన్న ప్రతి సన్నివేశాన్ని ఎంత అద్భుతంగా తెరకెక్కించారనే తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి బ్రహ్మస్త్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మూవీలో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించగా.. అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్, అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలలో నటించారు.
Concept Art – Test Shoot – Final Shot !! #RRRMovie pic.twitter.com/ySNRiqRtFp
— RRR Movie (@RRRMovie) September 6, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.