Hanu Man: థియేటర్స్‌లోకి రానేలేదు.. అప్పుడే.. హనుమాన్ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

|

Jan 02, 2024 | 11:56 AM

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సూపర్ హీరో బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఇతిహాసాల ఆధారంగా సూపర్ హీరోలను రూపొందించి చూపించనున్నాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాను జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా కూడా వస్తుంది.

Hanu Man: థియేటర్స్‌లోకి రానేలేదు.. అప్పుడే.. హనుమాన్ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Hanuman
Follow us on

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు హీరోగా మరి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో తేజ సజ్జ. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు హను మాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సూపర్ హీరో బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఇతిహాసాల ఆధారంగా సూపర్ హీరోలను రూపొందించి చూపించనున్నాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాను జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా కూడా వస్తుంది. అయితే సినిమా పై ఉన్న నమ్మకంతో అదే రోజు సినిమాను రిలీజ్ చేయనున్నారు హనుమాన్.

ఇక ఈసినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ అవ్వడంతో సినిమా కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమా పై చాలా వరకు క్లారిటీ ఇచ్చారు. తాజాగా మేకర్స్ హనుమాన్ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు.

హనుమాన్ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ అయిన60 రోజులకు అంటే రెండు నెలలకు ఓటీటీలో రిలీజ్ చేస్తాం అని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇదిలా ఉంటే హనుమాన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అన్నదాని పై క్లారిటీ రాలేదు. హనుమాన్ ట్రైలర్ లో ఆంజనేయుడు తిరిగి వచ్చినట్టు చూపించారు. అయితే కళ్లు మాత్రమే చూపించడంతో అవి చిరంజీవి కళ్లు పొలిఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది .

తేజ సజ్జ ఇన్ స్టాగ్రామ్

తేజ సజ్జ ఇన్ స్టాగ్రామ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.