Kangana Ranaut : డిజిటల్ కు సిద్దమవుతున్న’తలైవి’ అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

సెకండ్ వేవ్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అన్న విషయంలో క్లారిటీ లేదు. దీంతో పెద్ద సినిమాలు రిలీజ్ విషయంలో డైలామాలో పడ్డాయి.

Kangana Ranaut : డిజిటల్ కు సిద్దమవుతున్నతలైవి అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Kangana Talaivi

Updated on: Jun 06, 2021 | 6:13 AM

Kangana Ranaut : సెకండ్ వేవ్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అన్న విషయంలో క్లారిటీ లేదు. దీంతో పెద్ద సినిమాలు రిలీజ్ విషయంలో డైలామాలో పడ్డాయి. ఈ నేపథ్యంలో జయలలిత బయోపిక్ తలైవి డిజిటల్ రిలీజ్‌కు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై మరోసారి క్లారిటీ ఇచ్చింది తలైవి టీమ్‌. జయ జీవితం బిగ్‌ స్క్రీన్ మీద ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది అన్నది మూవీ టీమ్‌ చెబుతున్న విషయం. తమిళనాడు ఎలక్షన్స్‌కు ముందే తలైవి రిలీజ్‌కు ప్లాన్ చేశారు మేకర్స్‌. అయితే కరోనా కారణంగా షూటింగ్ డిలే కావటం.. ఆ తరువాత కూడా రిలీజ్‌కు అనువైన పరిస్థితులు లేకపొవటంతో వాయిదా పడుతూ వచ్చింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం.. వరుసగా ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధిస్తుండటంతో ‘తలైవి’ సినిమా విడుదలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసారు.

ఇప్పుడు కూడా సిచ్యుయేషన్‌ అలాగే ఉంది. థియేటర్లు తెరుచుకునేది ఎప్పుడూ..? ఒకవేళ తెరుచుకున్న ఆడియన్స్‌కు పూర్తి స్థాయిలో పర్మిషన్ ఇస్తారా..? అసలు ఆడియన్స్ వస్తారా..? ఇలా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దీంతో తలైవి లాంటి సినిమాలు డిజిటల్ రిలీజ్‌కు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో భారీ డీలింగ్ కూడా సెట్ అయ్యిందని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్‌ పెడుతూ… జయ బయోపిక్‌ థియేటర్లలోనే రిలీజ్ అవుతుందంటున్నారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమా నయా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమా కోసం ఇటు కంగనా అభిమానులు, అటు జయలలిత ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఆర్జీవీ తో ఆరియనా వెరీ హాట్ గురూ..!ఎక్కడ చూడని ఇంత అందం.యూ ఆర్ వెస్టింగ్ యువర్ బ్యూటీ అంటున్న డైరెక్టర్ :RGV and Ariyana viral video.

హాట్ డాన్సుతో కాకరేపిన యాంకర్ విష్ణుప్రియ..బుల్లితెర బ్యూటీ ల మధ్య వార్ ..:Anchor Vishnu priya hot Video.