టాలీవుడ్ సీనియర్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ(79) కన్నుమూశారు. ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో మహేష్ బాబు భార్య ఆయన్ని కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కార్డియాక్ అరెస్ట్ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులపై కూడా పడటంతో కృష్ణ ఆరోగ్యం బాగా విషమించిందని నిన్న వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ కృష్ణ ప్రాణాలను కాపాడలేకపోయారు. ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.
ఒకనాటి యువతుల కలల చెలికాడు. యువతరం మదిని మీటిన మొనగాడు…ప్రజాస్వామ్య విలువలతో వెండితెరను ప్రభావితం చేసిన నటరాజు సూపర్ స్టార్ క్రిష్ణ యావత్ తెలుగు ప్రేక్షక లోకాన్ని దుఃఖసాగరంలో ముంచి దివికేగి ఆకసంలో తారగా నిలిచాడు. కార్డియాక్ ఆరెస్ట్‌తో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ ఈ తెల్లవారు ఝామున తుది శ్వాస విడిచారు. తెలుగు తెరను సుదీర్ఘకాలం శాసించిన సన్ ఆఫ్ ద సాయిల్ మరణం తెలుగు సమాజాన్ని దుఃఖసాగరంలో నింపింది.
సూపర్ స్టార్ కృష్ణ ఈ తెల్లవారు ఝామున 4 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కృష్ణ పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 1942 మే 31న జన్మించిన కృష్ణ మనసు ఆయన సినిమా పేరుకు తగ్గట్టే తేనె మనసు. తెలుగు సినీ ప్రపంచాన్ని అమితంగా ప్రభావితం చేసినా….వాదాలకీ వివాదాలకీ అతీతంగా జీవితాన్ని తెలుగు చిత్రానికే అంకితమిచ్చిన ధృవతార కృష్ణకి అశేష ప్రేక్షక జనలోకం మదినిండుగా నివాళ్ళర్పిస్తోంది.
రేపు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు పద్మాలయలో అభిమానుల సందర్శనార్థం ఆ తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు
అభిమానుల సందర్శనార్థం ఈరోజు రాత్రి విజయ్ కృష్ణ నివాసంలోనే సూపర్ స్టార్ కృష్ణ పార్ధివదేహం. రేపు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో కృష్ణ పార్థివదేహం .. ఆ తరువాత మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు. గచ్చిబౌలి స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ చివరి నిమిషంలో ఇంట్లోనే పార్ధివదేహం ఉంచాలని కుటుంబ సభ్యుల నిర్ణయం
సూపర్ స్టార్ కృష్ణ పార్దీవ దేహ దర్శనానికి నివాళులు అర్పించడానికి గచ్చిబౌలి స్టేడియానికి చేరుకున్న అభిమానులు
సినిమా పరిశ్రమలో దాదాపుగా మూడు దశాబ్దాల పాటు అనేక అభ్యుదయ, జానపద, సాంఘీక, కౌబాయ్ సినిమాలకు ఒక ఒరవడి సృష్టించి సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గా ఎదిగారు… నటునిగా ఆరంభంలో కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ ప్రజానాట్యమండలిలో డాక్టర్ గరికపాటి రాజారావు నాయకత్వంలో చైర్మన్ తదితర నాటకాలలో నటించి తన నటనకు మెరుగులు దిద్దుకున్నారు. ఆ తర్వాత సినిమా రంగంలో తను నిర్మించిన ప్రతీ సినిమాని కూడా సినిమా స్కోప్, 70 ఏం ఎం లాంటి నూతన సాంకేతిక వ్యవస్థ ఉండేటట్లుగా రూపొందించేవారు. ప్రజానాట్యమండలి సభ్యుడు అయిన మాధవరావు గార్ని తన జీవితాంతం మేకప్ మాన్ ఉంచుకొన్నారు, డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న కృష్ణ కు సినిమా ప్రజానాట్యమండలి తరపున వందేమాతరం శ్రీనివాస్, మద్దినేని రమేష్ బాబు, డాక్టర్ మాదాల రవి లు ప్రగాఢ సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసారు.
మరికాసేపట్లో నానక్ రామ్ గూడ విజయకృష్ణ నివాసం నుంచి గచ్చిబౌలి స్టేడియంకు కృష్ణ భౌతికకాయం. రేపు మధ్యాహ్నం 12:30 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం గచ్చిబౌలి స్టేడియంలోనే కృష్ణ పార్థివ దేహం
రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు గచ్చిబౌలి నుంచి పద్మాలయకు కృష్ణ అంతిమ యాత్ర. పద్మాలయలో పూజలు నిర్వహించిన అనంతరం మహాప్రస్థానంకు అంతిమ యాత్ర
రేపు ఉదయం 11 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో కృష్ణ భౌతికకాయనికి నివాళులు అర్పించనున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
కృష్ణ భౌతికదేహాన్ని చూసి మోహన్ బాబు బోరున విలపించాడు. ఆయన శవపేటికను పట్టుకుని వెళ్లి వెక్కి ఏడ్చాడు. కష్ట సమయంలో తనను కృష్ణనే పైకి తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నాడు. ఆయనతో కలిసి 70పైగా సినిమాల్లో నటించానని, కొన్ని చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేశానని తెలిపాడు. ఆయన మరణాన్ని తట్టుకోలేకపోతున్నానని వెల్లడించాడు.
– రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు.
– కృష్ణగారు నా ఫేవరేట్.
– ఆయన కుటుంబానికి నా ప్రగడసానుభూతి.
– మహేష్ బాబు ఈ ఏడాది క్లిష్ట పరిస్థితి నెలకొంది.
– ఆయనకి మరింత ధైర్యం చేకూరాలని దేవుణ్ణి వేడుకుంటున్న
సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. మహేష్‌బాబు, నమ్రతాను ఆయన పరామర్శించారు.
కృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించిన తెలుగు దేశం అధినేత చంద్రబాబు. మహేష్ బాబును ఓదార్చారు చంద్రబాబు
కృష్ణ పార్థివదేహానికి నివాళ్లు అర్పించిన అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాగచైతన్య, కీరవాణి, బోయపాటి, త్రివిక్రమ్ శ్రీనివాస్
A Fearless man who attempted every genre!! The original cowboy of Telugu films!! I could sit with him for hours which were filled with his positivity? the man the legend the superstar!!#RIPSuperStarKrishnaGaru we will miss you??? pic.twitter.com/ccJlBP1CZd
— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 15, 2022
దివంగత సినీ నటుడు కృష్ణ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో రేపు అంత్యక్రియలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను సీఎం కేసీఆర్ఆదేశించారు.
రాఘవేంద్రరావును పట్టుకొని బోరున విలపించిన మహేష్..
తండ్రి పార్ధీవదేహాన్నిచూసి కన్నీరు మున్నీరు అవుతున్న మహేష్ బాబు
Krishna Garu was a legendary superstar, who won hearts of people through his versatile acting and lively personality. His demise is a colossal loss to the world of cinema and entertainment. In this sad hour my thoughts are with @urstrulyMahesh and his entire family. Om Shanti.
— Narendra Modi (@narendramodi) November 15, 2022
కాసేపట్లో హైదరాబాద్ కు సీఎం జగన్ . కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించనున్న సీఎం జగన్
కృష్ణ మరణ వార్తతో సినీలోకం మూగబోయింది. ఆయన పార్ధీవదేహాన్ని పవర్ స్టార్ కళ్యాణ్ సందర్శించి నివాళి అర్పించారు. పవన్ మాట్లాడుతూ.. మహేష్ ముగ్గురు కుటుంబసభ్యులను కోల్పోవడం బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతీ తెలుపుతున్నా అని పవన్ అన్నారు.
నానక్ రామ్ గూడా లోని ఇంటికి చేరుకున్న కృష్ణ భౌతికకాయం.. తరలి వస్తున్న సినీ ప్రముఖులు
కేవలం నటుడు గానే కాకుండా నాకు మంచి స్నేహితుడు, నా కుటుంబానికి ఎంతో ఆప్తుడు.. మంచితనానికి మారుపేరు కృష్ణ. దేవుడు చేసిన మనిషిని దేవుడే తన దగ్గరకు పిలిపించుకున్నాడు.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ..కృష్ణ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను: కే రాఘవేంద్రరావు.
సూపర్ స్టార్ కృష్ణ అంతిమ సంస్కారాలు రేపు జరగనున్న నేపథ్యంలో రేపు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సెలవు ప్రకటించిన నిర్మాతల మండలి
Deeply saddened by the news of the passing away of Telugu cinema superstar, Ghattamaneni Krishna ji.
His unmatched professional discipline and work ethics set an example on conduct in public life. My heartfelt condolences to his family, friends and fans. pic.twitter.com/cO83w8kNiT
— Rahul Gandhi (@RahulGandhi) November 15, 2022
Our prayers and respects to Krishna garu, sending lots of love and strength to @urstrulymahesh and family. It’s been a tough year for you brother.. We are with you!
— Suriya Sivakumar (@Suriya_offl) November 15, 2022
Deeply saddened to know about the demise of legendary Telugu actor #SuperStarKrishna garu.
Heartfelt condolences to his family & fans in this hour of grief.తెలుగు లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారి హఠాన్మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. @urstrulyMahesh pic.twitter.com/0iCJ0TS9P1
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) November 15, 2022
Woke up to the terrible news of #SuperStarKrishna Garu’s demise. Truly a legendary actor & one of the most humble stars of Telugu Film industry
Heartfelt condolences to my dear friend @urstrulyMahesh in this hour of grief. Losing both parents within a couple of months is tragic
— KTR (@KTRTRS) November 15, 2022
ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గచ్చిబౌలి స్టేడియం కు, ఎల్లుండి 17 వతేదీన మహా ప్రస్థానంలో అంత్యక్రియలు
Deeply saddened on the passing of #KrishnaGaru a man who made a great mark as a #SuperStarKrishna . May his soul #RIPKrishnaGaru . My condolences to @urstrulyMahesh and family in these trying times??? pic.twitter.com/SZKWLoaHYF
— Radikaa Sarathkumar (@realradikaa) November 15, 2022
Saddened to learn about the demise of #SuperStarKrishna Garu..May his soul rest in peace..Sending my deepest condolences and strength to @urstrulyMahesh Sir & the entire family in these testing times..Om Shanti ?? pic.twitter.com/TFkxkKboUW
— Pragya Jaiswal (@ItsMePragya) November 15, 2022
Such a devastating loss to the entire film industry, What a Legend he was.
I had the pleasure of working with him and a total privilege to know him personally.
Rest in peace #SuperStarKrishna garu!Heartfelt condolences to Mahesh & family in this hour of grief. OM SHANTI ?
— Ravi Teja (@RaviTeja_offl) November 15, 2022
The demise of Krishna garu is a great loss to the Telugu film industry … working with him in 3 films are memories i will always cherish. My heartfelt condolences to his family …may his soul rest in peace @urstrulyMahesh
— Rajinikanth (@rajinikanth) November 15, 2022
కృష్ణకు సర్వం ఇండస్ట్రీనే అన్నారు వాణిశ్రీ. కృష్ణ గారు ఎప్పుడు కొత్తదనం కోసం ప్రాకులాడేవారు.. ఆయన సంపాదించిందంతా సినిమా కోసమే పెట్టారు కృష్ణ అన్నారు వాణి శ్రీ.
Saddened by the passing away of veteran Telugu actor #SuperStarKrishnaGaru. He was a visionary who pioneered many innovations in Telugu Cinema.
His demise is an irreparable loss to Indian Film Industry. I convey my heartfelt condolences to @urstrulyMahesh & his family.
— M.K.Stalin (@mkstalin) November 15, 2022
సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని ఈ రోజు ఉదయం 10.30 నానక్ రాంగూడ, అభిమానుల సందర్శనార్థం రేపు గచ్చిబౌలి స్టేడియం, గురువారం ఉదయం పద్మాలయ స్టూడియో, అనంతరం కృష్ణ పార్థివ దేహానికి మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు జరుపబడును.
కృష్ణ గారు అంటే సాహసానికి మరో పేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా, సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు పరిచయం చేసిన మీ ఘనత ఎప్పటికి చిరస్మరణీయం.
My thoughts are with Mahesh Anna and the family.
Om Shanthi. Superstar forever.
— Jr NTR (@tarak9999) November 15, 2022
అభిమానుల సందార్ధనార్థం గచ్చిబౌలి స్టేడియంకు కృష్ణ భౌతికకాయం తరలించనున్నారు కుటుంబసభ్యులు
సూపర్ కృష్ణ అనారోగ్యంతో కన్నుమూయడంతో సినీలోకంలో విషాదం నిండింది. కృష్ణ మృతికి తెలుగు దేశం అధినేత చంద్రబాబు, లోకేష్ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత అభిమానులు సూపర్ స్టార్ గా పిలుచుకునే సినీ హీరో కృష్ణ (శ్రీ ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి, 79) మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు.
ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత అభిమానులు సూపర్ స్టార్ గా పిలుచుకునే సినీ హీరో కృష్ణ (శ్రీ ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి, 79) మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు.#SuperStarKrishna
— Telangana CMO (@TelanganaCMO) November 15, 2022
ఏడాదికి 19 చొప్పున 300 సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మూడు షిఫ్టుల చొప్పున వేగంగా సినిమాలు చేసేవారు కృష్ణ.
మాటలకు అందని విషాదం ఇది. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి వూపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం..వీటి కలబోత కృష్ణ గారు.
అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమ లోనే కాదు, భారత సినీపరిశ్రమ లోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ,అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియ చేసుకొంటున్నాను.. అంటూ మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా శ్రీ కృష్ణ గారు చేసిన సేవలు చిరస్మరణీయాలు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు. విభిన్న పాత్రలు పోషించిన శ్రీ కృష్ణ గారు కౌబోయ్, జేమ్స్ బాండ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన తన ముద్ర వేశారు. శ్రీ కృష్ణ గారి మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరని లోటు. ఆయన కుమారుడు శ్రీ మహేష్ బాబు గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా తరపున , జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
సినిమా రంగానికి కృష్ణ చేసిన సేవలు అజరామరం.. సూపర్ స్టార్ మృతికి సంతాపం వ్యక్తం చేసిన కేటీఆర్. తెలుగు సినిమా చరిత్రలో విభిన్న తరహ పాత్రలను పోషించడంతోపాటు, అద్భుతమైన సినిమాలను నిర్మించి తెలుగు సినిమా చరిత్రలో తనదైన స్థానాన్ని సూపర్ స్టార్ కృష్ణ సృష్టించుకున్నారన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటన్న కేటీఆర్, కృష్ణ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు.
మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో కృష్ణ గారను మరణించారని వైద్యులు తెలిపారు. కృష్ణకు మేజర్ బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. దాంతో ఆయన తెల్లవారు జామున 4గంటల9 నిమిషాలకు మరణించారు
కృష్ణ గారు సాహసానికి మారు పేరు. అంతటి నిర్మాత, అంతటి నటుడు కృష్ణగారు లేరు అంటే తట్టుకోవడం కష్టమే.. ఆయన కుటుంబానికి నా ప్రగాఢసానుభూతి అన్నారు నటుడు బ్రహ్మానందం
1969 లో కృష్ణ నటించిన 19 సినిమాలు విడుదల అయ్యాయి..
1970లో పద్మాలయ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన కృష్ణ. ఈ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారు కృష్ణ
కృష్ణ నటించిన సినిమాల్లో తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం).
2003 లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్న ఆ సూపర్ స్టార్ కృష్ణ.
కృష్ణ తో ఉన్న అనుబంధాన్ని తలుచుకొని ఎమోషనల్ అయిన మురళీ మోహన్.
మరికాసేపట్లో విజయ్ కృష్ణ నిలయానికి కృష్ణ భౌతికకాయం.
ఎన్టీ రామారావుతో కలిసి తొలిసారి ‘స్త్రీ జన్మ’ అనే సినిమాలో నటించారు. ‘మంచి కుటుంబం’ సినిమాలో ఏఎన్నార్ అల్లుడి పాత్ర పోషించారు.
మోసగాళ్ళకు మోసగాడు’ అనే తొలి కౌబాయ్ సినిమా చేశారు. ఈ సినిమానే ఆయనకు స్టార్డమ్ తెచ్చిపెట్టింది.
కృష్ణ మృతికి సంతాపం తెలిపిన గవర్నర్, సీఎం జగన్
సినిమాల్లో విజయనిర్మల కథానాయికగా ఎక్కువ సినిమాల్లో నటించారు. కృష్ణ – విజయనిర్మల కలిసి తొలిసారి ‘సాక్షి’ సినిమాలో జోడీ కట్టారు.
ఏడాదికి 10 సినిమాలు చేసిన ఘనత , రికార్డు కృష్ణ సొంతం
1964-1995 మధ్యలో 300ల సినిమాలు చేసిన సూపర్ స్టార్ కృష్ణ
కృష్ణ మృతితో కన్నీరుమున్నీరు అవుతున్న ఫ్యాన్స్ , కుటుంబసభ్యులు
కృష్ణ పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణ 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు
సూపర్ స్టార్ కృష్ణ తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు..
కాంటినెంటల్ హాస్పటల్ లోనే కృష్ణ మృతదేహం.. హాస్పటల్ కు చేరుకుంటున్న సినీ ప్రముఖులు
కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉన్నాయి
అనారోగ్యంతో కాంటినెంటల్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన సూపర్ స్టార్..
సూపర్ స్టార్ కన్నుమూతతో విషాదంలో టాలీవుడ్ . సినీ ప్రముఖులంతా నివాళులు అర్పిస్తున్నారు.
కార్డియాక్ అరెస్ట్‌తో ఆదివారం రాత్రి ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ.. చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున 4 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదం నెలకొంది