Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట షూటింగ్ అప్డేట్.. గోవా బీచ్‌లో విలన్లను ఇరగదీస్తున్న మహేష్..

|

Aug 21, 2021 | 9:31 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న

Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట షూటింగ్ అప్డేట్.. గోవా బీచ్‌లో  విలన్లను ఇరగదీస్తున్న మహేష్..
Mahesh Babu
Follow us on

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో సూపర్ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నాడు మహేష్. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ సంచలన రికార్డులు క్రియేట్ చేస్తుంది. మహేష్ అభిమానుల అంచనాలకు మించి ఈ టీజర్ ఉంది. ఇక బ్యాంకింగ్ రంగంల్లో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతోపాటు అదిరిపోయే కామెడీ కూడా ఉండనుంది. ఇక గీత గోవిందం సినిమా తర్వాత పరశురామ్ చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో హై ఎక్స్పెటెషన్స్ ఏర్పడ్డాయి. ఇప్పటికే దుబాయ్, హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకున్న సర్కారు వారి పాట ఇప్పుడు గోవాలో హడావిడి చేస్తుంది.

గోవా బీచ్‌లో భారీ ఫైట్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారట. ఈ ఫైట్ సీన్ సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్‌గా ఉంటుందని అంటున్నారు చిత్రయూనిట్. . గోవా బీచ్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ షెడ్యూల్ ముగింపు దశకు వచ్చింది. తొందర్లోనే  మళ్లీ సర్కారు వారి పాట టీమ్ హైదరాబాద్‌‌‌కు చేరుకోబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మహేష్. సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసి మాటల మాంత్రికుడి సినిమాను పట్టాలెక్కించనున్నాడు. సర్కారు వారి పాట  సినిమా షూటింగ్‌‌‌ను సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ముగించి ఆ వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టాలనే ఉద్దేశ్యంలో మహేష్ బాబు ఉన్నాడు. ఇక సర్కారు వారి పాట సినిమా వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Thala Ajith’s Valimai : శరవేగంగా అజిత్ సినిమా షూటింగ్.. చివరి దశలో వాలిమై.. రష్యాలో టీమ్..

బుట్టబొమ్మపై ఫైర్‌ అయిన ఎమ్మెల్యే రోజా భర్త.. స్టార్ డమ్‌ రాగానే మారిపోయిందని విమర్శలు..

Andamaina Lokam: ఆకట్టుకునే ప్రేమ కథతో రానున్న అందమైన లోకం.. త్వరలోనే రెగ్యులర్ షూట్

Honey Trapping: బ్లాక్ మెయిల్ కాదది.. బ్లూ మెయిల్.. పిచ్చెక్కి తిరిగే కుర్రబ్యాచ్‌ బీ-కేర్‌ఫుల్.. వల్లో పడ్డారా ఇక అంతే..