
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ సినిమా కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూడో సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, కాలేజీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు గుంటూరు కారం అనే మాస్ మసాలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ ఇద్దరు. గుంటూరు కారం సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ అవతారంలో కనిపించనున్నాడు. గుంటూరు కారం సినిమాలో మహేష్ కు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది.
రీసెంట్ జీ గుంటూరు కారం సినిమానుంచి దమ్ మసాలా అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈసాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. సినిమా పై అంచనాలు పెంచేసింది ఈ సాంగ్. గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12న గుంటూరు కారం సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమానుంచి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెకండ్ సాంగ్ గా ఓ మెలోడీని రిలీజ్ చేయనున్నారట. త్వరలోనే దీని పై ఓ అప్డేట్ ఇవ్వనున్నారట. అలాగే ఇంకో నాలుగు సాంగ్స్ షూట్ చేయాల్సి ఉందట. ఈసాంగ్ షూట్ తో గుంటూరు కారం సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. డిసెంబర్ మధ్యలో ఈ మూవీ షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టనున్నారట. త్వరలోనే దీని పై మరింత క్లారిటీ ఇవ్వనున్నారు. జనవరి 12న సినిమా రిలీజ్ అవ్వడం ఖాయం అంటున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎదురొచ్చేగాలి ఎగేరేస్తున్నా చొక్కాపై గుండీ .. 🌶
Dive into the intensity 🔥 of #GunturKaaram‘s First Single ~ #DumMasala, hitting hard and spicy.
A @MusicThaman Musical 🎹🥁
✍️ @ramjowrites
🎤 #SanjithHegde & #JyotiNooranSUPER 🌟 @urstrulyMahesh… pic.twitter.com/ofbADGdPzB
— Aditya Music (@adityamusic) November 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.