Mahesh Babu: బంగారం సార్ మా మహేష్ బాబు.. అభిమానుల కోసం సూపర్ స్టార్ ఏం చేశాడంటే

మహేష్ ఇంతవరకు పాన్ ఇండియా సినిమా చేయలేదు కానీ ఆయన క్రేజ్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉంది. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతోన్నారు సూపర్ స్టార్. సినిమాలతోనే కాదు సేవాగుణంలోనూ ఆయన సూపర్ స్టారే.. ఎంతో మంచి చిన్నారుల గుండెలకు తిరిగి ప్రాణం పోశారు మహేష్. వేల గుండె ఆపరేషన్స్ చేయించి ఆ చిన్నారుల కుటుంబాలకు దేవుడయ్యారు.

Mahesh Babu: బంగారం సార్ మా మహేష్ బాబు.. అభిమానుల కోసం సూపర్ స్టార్ ఏం చేశాడంటే
Mahesh Babu

Updated on: Nov 27, 2023 | 2:57 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన క్రేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే మహేష్ బాబు అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. మహేష్ ఇంతవరకు పాన్ ఇండియా సినిమా చేయలేదు కానీ ఆయన క్రేజ్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉంది. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతోన్నారు సూపర్ స్టార్. సినిమాలతోనే కాదు సేవాగుణంలోనూ ఆయన సూపర్ స్టారే.. ఎంతో మంచి చిన్నారుల గుండెలకు తిరిగి ప్రాణం పోశారు మహేష్. వేల గుండె ఆపరేషన్స్ చేయించి ఆ చిన్నారుల కుటుంబాలకు దేవుడయ్యారు. ఇక మహేష్ బాబు సింపుల్‌సిటీని ఇష్టపడని వారు ఉండరు. ఎంత సూపర్ స్టార్ అయినా మహేష్ చాలా ఒదిగి ఉంటారు. కాంట్రవర్సీలకు దూరంగా ఫ్యామిలి మ్యాన్ గా మంచి పేరును సొంతం చేసుకున్నారు మహేష్ బాబు. ఇదిలా ఉంటే మహేష్ బాబు చేసిన పని ఇప్పుడు ఆయన అభిమానులను గర్వపడేలా చేస్తుంది.

మాములుగా హీరోలు సెల్ఫీలు ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపారు. అభిమానులు వచ్చి ఫోటోలు దిగుతుంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది హీరోలు అభిమానుల పై చేయి చేసుకున్న సన్నివేశాలు కూడా లేకపోలేదు. మహేష్ బాబు మాత్రం తన అభిమానులను ఎప్పుడు నిరాశపరచలేదు. అప్పుడెప్పుడో ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ అభిమాని స్టేజ్ పైకి వచ్చి హడావిడి చేసిన నవ్వతూ అతడిని పంపించాడు మహేష్ బాబు.

ఇదిలా ఉంటే మహేష్ బాబు తాజాగా 200 మందికి ఫోటోలు ఇచ్చాడు. మహేష్ బాబుకు అభిమానులు కానీ వారు ఎవరుంటారు చెప్పండి. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సాంగ్ షూటింట్ ఇటీవలే జరిగింది. ఈ సాంగ్ షూటింగ్ లో వందల మంది డ్యాన్సర్లు  పాల్గొన్నారు. అయితే వారంతా మహేష్ బాబు అభిమానులు కావడంతో వారు ఆయనతో ఫోటో దిగాలని ఆశపడ్డారు. దాంతో షూటింగ్ పూర్తయిన తర్వాత 200 మందితో ఓపికగా ఫోటోలు దిగారు మహేష్. ఈ విషయాన్నీ సదరు డాన్సర్లలో ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.