ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు నేడు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు, రాజకీయ ప్రముఖులు, పలువురు సినీ సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ ను షేర్ చేశారు. బర్త్ డే విషెస్ తెలుపుతూ.. ఈ ఏడాది మీరు మరిన్ని విజయాలు సాధించాలని.. నిండు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు మహేష్ బాబు తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. మహేష్ బాబు జగన్ కు బర్త్ డే విషెస్ తెలుపడంతో ఇద్దరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు .
మహేష్ బాబు ట్వీట్ చేస్తూ..” గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈఏడాది మీకు ఆనందం, విజయం అలాగే మంచి ఆరోగ్యంకలగాలని కోరుకుంటున్నా!” అని రాసుకొచ్చారు. మరో వైపు కింగ్ నాగార్జున కూడా జగన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.
Happy birthday to the honourable CM, @ysjagan. Wishing you a year filled with happiness, success, and good health!
— Mahesh Babu (@urstrulyMahesh) December 21, 2023
“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, … మీరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, శ్రేయస్సుతో జీవించాలని కోరుకుంటున్నాను” అని నాగార్జున ట్వీట్ చేశారు.
Wishing the Andhra Pradesh, chief minister shri Ys jagan mohan reddy garu many happy returns of the day… May you be blessed with health, happiness and prosperity!!#HBDYSJaganmohanreddygaru
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 21, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.