Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో కరోనా కలకలం.. చిత్రకరణకు చిన్న బ్రేక్

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు న‌ల‌భై ఐదేళ్ల‌ వ‌య‌సులోనూ ఇర‌వై ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు. వయసు పెరిగే కొద్దీ మహేష్‌ మాత్రం​ ఇంకా యంగ్‌గా

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో కరోనా కలకలం.. చిత్రకరణకు చిన్న బ్రేక్

Updated on: Apr 19, 2021 | 6:38 AM

Sarkaru Vaari Paata: సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు న‌ల‌భై ఐదేళ్ల‌ వ‌య‌సులోనూ ఇర‌వై ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు. వయసు పెరిగే కొద్దీ మహేష్‌ మాత్రం​ ఇంకా యంగ్‌గా కనిపిస్తూ రోజురోజుకీ త‌న‌ అందాన్ని పెంచుకుంటూ పోతున్నారు.ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో  కనిపించనున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ సంస్థలు నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. మహానటి ఫేం కీర్తి సురేష్‌ ఈ సినిమాతో తొలిసారి మహేష్‌తో జోడీ కట్టనున్నారు. బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ మూవీ ఇదని తెలుస్తోంది. ఈ మూవీ కోసం జిమ్ముల్లో కసరత్తులు చేసి మహేష్ ఫిజికల్ గా గొప్ప మేకోవర్ ని తేవడం ఆసక్తికరం. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇప్పటికే దుబాయ్ గోవాలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ కో షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఇటీవల చిత్రయూనిట్ లో ఐదుగురికి కరోనా సొంకిందని తెలుస్తుంది. ప్రస్తుతానికి పరిస్థితులు అనుకూలంగా లేనందున సినిమా షూటింగ్ వాయిదా వేయాలని మహేష్ మేకర్స్ ను కోరడం వల్లే ఆచితూచి అడుగులేస్తున్నారట. ఇప్పటికే  మొత్తం మూవీ యూనిట్ అందరికీ కరోనావైరస్ పరీక్షలను చేయిస్తున్నారు. పరిస్థితి కొంత అనుకూలంగా మారినా తిరిగి ప్రారంభిస్తారని తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Arjun : అల్లుఅర్జున్ ఐకాన్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్..

Megastar Chiranjeevi: చిరు సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్.. నో చెప్పిన అనురాగ్ కశ్యప్..

Priyaprakh Warrier: ప్రియా.. క‌న్ను కొట్టినంత ఈజీ కాదు మూతి తిప్ప‌డం. వైర‌ల్ అవుతోన్న గంగ‌వ్వ‌ వీడియో..