Navdeep – Madhapur drugs case: మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్‌కు మెల్లిమెల్లిగా ఉచ్చు బిగుస్తోంది. ముందస్తు బెయిల్ రద్దు కావటం.. ఇప్పుడు పోలీసులు నోటీసులు జారీ చేయటం.. అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు చెప్పటం.. ఇవన్నీ చూస్తుంటే.. నవదీప్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టే కనిపిస్తోంది. టాలీవుడ్‌లో ఏ డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చినా హీరో నవదీప్ పేరు వినిపిస్తోంది. ఇప్పుడు మాదాపూర్ డ్రగ్స్ కేసులో కూడా అదే రిపీటైంది. కాకపోతే.. ఈసారి తప్పించుకునే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. నవ్‌దీప్‌కి బెయిల్ ఇవ్వొద్దన్న నార్కొటిక్ పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు.. నవదీప్‌పై కఠిన చర్యలు తీసుకోరాదని, నోటీసులు ఇచ్చి విచారించవచ్చని తెలిపింది. దీంతో హైకోర్టు సూచన మేరకు 41A సీఆర్‌పీసీ కింద నవదీప్‌కు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ తప్పదని కూడా నోటీసుల్లో స్పష్టంగా రాసి ఉంది. మరి ఇవాళ నార్కోటిక్ పోలీసు విచారణకు నవదీప్ హాజరు అవ్వుతారా లేదా అన్న సస్పెన్స్ నెలకొంది..
ఈ నేపథ్యంలో మాదాపూర్ డ్రగ్స్ కేసులో A29 గా ఉన్న హీరో నవదీప్ నేడు నార్కోటిక్ పోలీసుల ముందు హాజరుకానున్నట్లు సమాచారం. డ్రగ్స్ సప్లయర్ రామచందర్ తో నవదీప్‌కు ఉన్న సంబంధాలపై నవదీప్ నుంచి నార్కోటిక్ పోలీసులు వివరాలు ఆరా తీయనున్నారు. హీరో నవదీప్ ద్వారా ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అయినట్టు నార్కోటిక్ పోలీసులు అనుమానిస్తున్నారు. సప్లయర్ రామచందర్ పట్టుబడినప్పటినుంచి హీరో నవదీప్ అజ్ఞాతంలో ఉన్నట్లు పేర్కొంటున్నారు. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పేరు రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించారంటూ పోలీసులు పేర్కొంటున్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసి 41 ఏ సిఆర్పిసి కింద విచారణకు హాజరు కావాలని నవదీప్ కు హైకోర్టు సూచించడంతో నార్కోటిక్ విభాగం నవదీప్ నుంచి కీలక వివరాలు సేకరించేందుకు సిద్ధమవుతోంది.
డ్రగ్స్ సప్లయర్ రామ్‌చందర్‌తో నవదీప్‌కు సంబంధాలు.. సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా.. డ్రగ్స్ దందాలో ఉన్నవారెవరూ.. ఎవరెవరకు డ్రగ్స్ సరఫరా చేశారు.. ఇలాంటి కీలక వివరాలను పోలీసులు నవదీప్ నుంచి సేకరించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..